Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

ఉత్తరం చాలులే..

ఉత్తరం చాలులే..

1 min
438

ప౹౹

వ్యర్థమైన ప్రేమలోన ఎదలే మరల మరల కలపను

అర్థమైన ఒక ఉత్తరం చాలులే స్పర్థలే తొలగింపను ౹2౹

చ౹౹

ఉత్తరమంటే ఉత్త కబురులూ కాదులే ఉపేక్షించను

అత్తరు అగరు గుబాళింపులే అదనులో రక్షించను ౹2౹

కాకి చేత కబురంపేకన్నా ఉత్తరమే ఉత్తమం కాదా

ఏకాకితనమే పోగొట్టి ఎదురుగా నిలిచే నిజం కదా ౹ప౹

చ౹౹

అత్తమామలు అందించిన అర్ధాంగి పుట్టింటికెళ్ళగ

కొత్తకొత్త కోరికలతో ఆ ఉత్తరమేగ తిరిగి తీసికెళ్ళగ ౹2౹

రాయభారాలకు వ్యవహారాలకూ ఇదియే సాధనం

రాజకార్యాలకు రాసలీలకీ ఉత్తరమేగ మూలధనం ౹ప౹

చ౹౹

ఉత్తరకుమార ప్రగల్పాలన్నిటనే రాసుకోవటంకన్న

ఉత్తమమైన విషయాలనే లిఖించటం కాదా మిన్న ౹2౹

ప్రేమించే ప్రేమ ప్రవహించే ఆ సాధనం ఈ ఉత్తరమే

ప్రేమించేవాళ్ళకు ఆ ప్రేమ పంపిణీకీను ఈ ఉత్తరమే ౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Romance