Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ambica Lakshmi

Children Stories Inspirational Thriller

4.6  

Ambica Lakshmi

Children Stories Inspirational Thriller

డబ్బు ముఖ్యం కాదు

డబ్బు ముఖ్యం కాదు

2 mins
385



ఈ బిజీ జీవితంలో పిల్లలను కనే విషయమే మర్చిపోయారు ఒక జంట


రోజూ ఆఫీస్కు వెళ్ళమా తిరిగి వచ్చి పనులు చూసుకొని కాసేపు టీవీ చూసి పడుకున్నామా అనే పనిలోనే ఉండేవారు 


ఒక మంచి రోజున శుభవార్తతో భర్త దగ్గరకు వచ్చింది భార్య తను గర్భవతి అని.. భర్త అప్పుడే ఎందుకు మనం అంత డబ్బుని సంపదించలేదు తను పుడితే మళ్ళీ తన మీద మళ్ళీ ఖర్చు పెట్టాలి 


భార్య : మీరు ఏం బాధ పడకండి నేను కదుపుతూ ఉన్న రేపు మనకి బిడ్డ పుట్టినా సరే నేను ఏం ఉద్యోగం చెయ్యడం మాన్నేయను కంగారు పడకండి


అలాగే రేయి పగలు తేడా లేకుండా ఇద్దరు సంపాదించడంలో పడిపోయారు

బిడ్డ పుట్టింది తన ఆలన పాలన కూడా పట్టించుకోకుండా

ఎవరికో అప్పగించి తనకి మూడు సంవత్సారాలు వచ్చే వరకు వారే పెంచేశారు ఆ తరవాత ఇంటికి తీసుకొని వచ్చారు

తనను అలా ఇంట్లోనే ఉంచేవారు బయట ప్రపంచం తెలియనివ్వకుండా తల్లి తండ్రి రోజు ఆఫీస్ కు వెళ్ళిపోయేవారు వచ్చిన తరవాత కూడా బిడ్డతో సరదాగా కాసేపు గడిపే వారు కాదు


ఆ చిన్న పిల్లకి ఒక గది చూసుకోవడానికి ఒక పని మనిషి ఇంట్లో ఎన్నో బొమ్మలు

ఆ పని మనిషి పిల్లను సరిగ్గా చూసుకొనేది కాదు తిండి తినిపించేది అంతే స్నానం చేయించేది తప్ప పిల్లతో ఆడుకోవడం కానీ చేసేది కాదు


ఆ చిట్టి తల్లి ఎక్కువ సమయం బొమ్మలతో గడపడం మొదలు పెట్టింది

బొమ్మలతో మాట్లాడడం వాటితోనే ఆడుకోవడం వాటితోనే తిరగడం చేసేది

ఆ అలవాటు ఆ పిల్లకి వేశనంగా మారింది

ఆమె మెల్లగా మనుషులతో కలవడం వారితో మాట్లాడడం పూర్తిగా మానేసింది


ఎవరైనా వచ్చి మాట్లాడిన సరే బొమ్మను తీసుకొని లోపలికి వెళ్ళిపోయేది ఆ బొమ్మతో మాట్లాడేది

తల్లి తండ్రి కూతురు పరిస్థితి చూసి కంగారు పడ్డారు

ఆమెను వారితో కలుపుకోవడానికి చూశారు 

కానీ వారికి తెలియనిది ఏమిటంటే సమయం అప్పటికే దాటేసింది అని

కొన్ని సంవత్సరాల తరవాత ఆ పాపను తీసుకొని వెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో చేర్చారు

అయినా ఆమెలో ఏ మార్పు రాలేదు

పాప తన బొమ్మలతో బాగా సంతోషంగానే గడిపింది

కానీ ఆ తల్లి తండ్రులు కూతురులో మార్పు కోసం ఎదురుచూస్తునే గడుపుతున్నారు


నీతి :

ఈ బిజీ పనులలో తల్లితండ్రులు కొంత సమయాన్ని తన కూతురుతో గడపడం చేసి ఉంటే ఈరోజు ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదు

పిచ్చిది అనే అనుకుంటున్నారు కానీ అలా పిచ్చి ప్రవర్తనకు కారణం మర్చిపోతారు ప్రజలు

కూతురు కోసం సంపాదించాలి అనుకున్నారు కానీ కుతురునే దూరం చేసుకోవాల్సి వచ్చింది ఆ తల్లి తండ్రులకు

డబ్బు ముఖ్యమే కానీ ప్రేమ ఇంకా ముఖ్యం ఆ విషయం మర్చిపోకండి.




Rate this content
Log in