Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Romance

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Romance

ప్రణయ మంత్రం

ప్రణయ మంత్రం

8 mins
596


అమ్మ....అమ్మ....మా ఫ్రెండ్స్ అందరు వచ్చేశారు....పరిచయం చేస్తాను రా....


వన్ సెకండ్....(సిక్స్ట్ సెన్స్ ప్రోగ్రాం లో ఓంకార్ అన్నట్టు అనింది)


అమ్మ ...నువ్వు అలా మాట్లాడకు మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు...


వంట గదిలోనుంచి వస్తూనే...చేతిలో...టీ కప్పులు...పక్కన పకోడీలు పెట్టీ తీసుక వస్తూ....ఏమంటివి ఏమంటివి...నన్ను మాట్లాడడం వద్దు అని అంటివా....ఎంత మాట....ఎంత మాట....


అంటి....మీరు ఎంత ఫ్రీ గా మాట్లాడుతారు....మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడుతు వుంటారా..... ఈషా చెప్తూ వుంటుంది...కానీ... మేమే నమ్మలేదు....అందుకే అసలు ఇంటికి తీసుకు వచ్చింది....ఇంకో కారణం కూడా ఉంది....


అవునా....ఎంటి అది...


ఈషా.... రమ నీ ఆపు అన్నట్లు గా చెయ్యి గట్టిగా పట్టుకుని సరికి...రమ సైలెంట్ అయిపోయింది...ఎక్కడ అసలు విషయం చెప్తుంది అని భయం తో... ఈషా కి చెమటలు పట్టేసాయి....


అమ్మ...నీకు ముందు మా ఫ్రెండ్స్ నీ పరిచయం చేస్తాను వుండు....ఈ పొడుగు జడ పిల్ల పేరు రమ....ఇంకా ఈ పొట్టి పిల్ల పేరు శిరీష....ఈ బక్కపిల్ల పేరు రమ్య....ఇంకా ఈ తెల్ల పిల్ల పేరు మానస....వీళ్ళు నలుగురు నా బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మ....


ఓ...ఒకే.....అవునా...ఇంకా...


అమ్మ..కొంచం వెటకారం ఆపి... సరిగా మాట్లాడు....ప్లీస్... నా ఫ్రెండ్స్ ముందు... నా పరువూ తీసేయకు అమ్మ...నికు దండం పెడతాను...


తథాస్తు....


నా పరువూ పోవడమా...లేక...నువ్వు వెటకారం ఆపడమా...


సరే లేవే....బయట వర్షం....అందుకే పకోడీలు చేసా...చల్లగా కాక ముందే తినండి....


హా...అంటి...తప్పకుండా...మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు అంట కదా...ప్లీస్ అంటీ మాకోసం ....


నేనా...వద్దు అమ్మ....మీరు అందరూ పిచ్చి వారు అవ్వడం నాకు యిష్టం లేదు....


అబ్బా... ప్లీస్ ఆంటీ...


సరే....మీరు కూడా నాతో పాడాలి మరి...అదే నమ్మ అంతక్షరి...


ఓ... ఒకే...


అం...త...క్ష... రి...ఆ...డు...కుమ్...ద...మా...సి...నీ...మా... పా.. ట..లు...పా... డూ...కు...న్... ధా...మా.... ఆంటీ మీకే మా వచ్చింది...పాడండి ..


అబ్బా...ముందు.. నాకే రావాలని వుందా...సరే...

మల్లెల వాన...మల్లెల వాన....

నాలోన....

మనసంతా...మధుమసంలో...విరబూసేనా...

కోయిల సంగీతం లా కీల కీల లే పాడించేన....


నా....వచ్చింది.... రమా...


నా పై...ఎం వున్నాయి..... నా పేరు చెప్పుకోండి...మీలో ఒకరయిన...చల్ల గాలి... చందమామ...చిలకమ్మ....


మా......


మాయదారి చిన్నోడు నా మనసే లగేసిండు....లగ్గం ఎప్పుడు రా మామ అంటే.... మాగ మాసం వచ్చేదాకా మంచి గడియే లేదన్నాడు....అరే...రే...రే... అగేదెట్టగ .... అందాక వేగేదెట్ట గా...


గల్లు గళ్లు...గజ్జ కొట్టన ...నీ గుండలోన గంట కోట్టన....


ఆటలతో...పాటలతో....నవ్వులతో నిండి పోయింది గది....


మీతో...ఆటలాడుతూ...అసలు టైమ్ చూసుకోలేదు....వుండండి...డిన్నర్ ప్రిపేర్ చేస్తా..మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పండి అమ్మ....9 వరకు వచేస్థం అని...లేదంటే కంగారు పడతారు....


సరే...అని అందరూ ఫోన్ చేసి చెప్పేశారు....


రమ...ఈశ వంక చూస్తూ వుంది...అసలు సంగతి ఎలా చెప్పాలి అని.... రమా, ఈషా....ఇద్దరు మాట్లాడుకొని...వంట గదిలోకి వెళ్ళారు...మేము సహాయం చేస్తాం అని...కూరగాయలు అందుకొని...తరుగుతున్నరూ...

చాలా సేపు ఎలా చెప్పాలి అని...అలోచించి... రమా ఇక మొదలు పెట్టింది....

ఆంటీ..మీది....లవ్ మ్యారేజ్ కథ....మీ లవ్ స్టోరీ చెప్తారా...ప్లీస్...


యిప్పుడు ఎందుకు లే...ఇంకా ఎప్పుడు అయిన చెప్తా....


ప్లీస్....చెప్పండి....


చెప్పడం మెదలు పెడితే యిప్పుడు ఆగదు కానీ...చిన్నగా చెప్తా....మాది...మిడిల్ క్లాస్ ఫ్యామిలీ....నేను చిన్నగా వున్నపుడే నాకు మా బావ తో పెళ్లి నిశ్చయం చేశారు....నేను 9 వ తరగతి లో ఉన్నపుడు... వీళ్ళ నాన్నా నన్ను ప్రేమించాడు....ముందు నేను ఒప్పుకోక పోయినా....తను నా పై చూపే ప్రేమకు ఒప్పుకోక తప్పలేదు....పెద్ద వారు కాదు అని అన్నారు...చిన్న వయసు...చదువు కూడా ఆగిపోయింది...పెళ్లి చేసుకున్నాం....కులీ పనులకు వెళ్తూ నన్ను చదివించారు.... ...పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు....ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కూడా... నా చదువు ఆపలేదు...అపనివ్వలేదు అయన....ఫలితం....టీచర్ ఉద్యోగం...


యింతే అమ్మ...


అయ్యో ... ఆంటీ నేను అడిగింది...మీ ప్రేమ కథ...


అయ్యో....వుండు...చెప్తా...మొదటి సారి తనని చూడ గానే....తన చుట్టూ ఉన్న వారందరూ అసలు కనపడ లేదు....ఎండ కొడుతున్న...చల్లని గాలి తాకింది....ఆ గాలికి చెట్లు కదిలి... పూల వర్షం కురిసింది...ఒక్క సారిగా గాలిలో తేలిపోతూ ఉన్న నో ఏమో అని అనిపించింది....గుండెల్లో గోదారి పరిగెడుతుంటే ఎలా వుంటుంది అల అనిపించింది.......................

హ్...............

ఇలా అంటాను అనుకున్నావా.....


అబ్బా అంటి....ఎంటి ఇది...


అంతే లే .....నిజాలు చెబితే యి పాడు లోకం నమ్మదు గా ...సినమాల లో ఉన్నట్లు...ఎం జరగదు ....నాకు మాత్రం జరగలేదు.....కానీ మనసు కి మాత్రం తెలిసి పోతుంది....తనని ప్రేమించ అని...అది చెప్పలేని ఒక అనుభూతి అంతే....నన్ను ప్రేమ గురించి ఇంత గుచ్చి గుచ్చి అడుగుతున్నారు అంటే....ఎదో విషయం వుంది.. ఎంటో చెప్పు....


రమా.... ఈషా వంక చూడగానే....వల్ల అమ్మ కూడా తనని చూస్తూ వుంటే....మోగని ఫోన్ నీ మోగుతున్నట్లు....హేలో డాడ్...వంట అయిపోయింది.....ఎప్పుడు వాస్తవ. . అంటూ మాట్లాడుతూ వెళిపోయింది....


చెప్పు రమా...నేను మీ అమ్మ లాంటి దాన్నే చెప్పు..


అది....అని నసుగు తునే.....

ఆంటీ....నేను ఒక అబ్బాయి నీ 5 సంవత్సరాలు గా ప్రేమిస్తున్నా....ఆ అబ్బాయి కి కూడా నేను అంటే చాలా ఇష్టం.... నా కోసం ఎం అయిన చేస్తాడు....నేను అంటే ప్రాణం.... నా తర్వాతే ఎవరయినా తనకి....మొదటి ప్రాధాన్యత నాకే ....నాకు నచ్చదు అని చెడు అలవాట్లు అన్ని మానేశాడు.....తనది....ఎం.బి. ఏ అయి పోయింది...ఉద్యోగం కోసం వెతుకుతున్న డు.... సంత్సరంన్నరక్రితం ఒక ఆక్సిడెంట్ లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు....తనకు అంటూ ఎవరు...లేరు....మా అమ్మ నాన్న వారికి మతం పిచ్చి ....తను క్రిస్టియన్....మతం విషయం లో...నన్ను నాకు నచ్చి నట్లు గా ఉండమన్నాడు .. ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు....ఎం చేయాలి అర్థం కావడం లేదు.....


సరే...ముందు బోజనం చేసాక...మీ ఫ్రెండ్స్ అందరు...వల్ల ఇంటికి వెళ్ళాక ...ఆ అబ్బాయిని ఇంటికి డిన్నర్ కి పిలువు....అని చెప్పి ముందుకువ్వెళ్ళిపోయింది....


ఈషా.. ఆంటీ ఎందుకు పిలుస్తుంది ....

నాకు మాత్రం ఎం తెలుసు రమా...ముందు అయితే పిలువు....

ఒకే...


.............. ........ .....


అంటి వంటలు చాలా బాగా వున్నాయి....చల్లటి వర్షం.....వేడి వేడి అన్నం,ముద్దపప్పు,అవకాయ,అప్పడాలు.... చివరలో డబుల్ కా మీట అయితే...సూపర్....

బాయ్ అంటి....గుడ్ నైట్....రమా నువ్వు రావా....


మీరు వెళ్ళండి...నేను కాసేపు అయ్యాక వెళ్తా...ఇంట్లో ఎవరూ లేరు...పెళ్లికి వెళ్ళారు...వచ్చే వరకు 11 అవుతుంది అన్నారు...అందుకే..


ఒకే...బాయ్...గుడ్ నైట్ రమా...


అన్ని సర్ధేస్తు....రమా ఎం అయింది...పిలవలేదు....


లేదు....అంటి...పిలిచాను....బయట వున్నాడు...


అయ్యో రమ్మని చెప్పు....మనం తింటూ మాట్లాడుకుందాం...నువ్వు ఆల్రెడీ తిన్న మళ్లీ మాతో కాస్త తిన వలసిందే ....తప్పదు ...


..... ...... .....


నమస్తే అంటి....

హా....రా....బాబు....కూర్చో....నీ గురించి రమా చెప్పింది....చాలా మంచి అమ్మాయి....10 సంవత్సరాలు గా వింటున్న తన గురించి...ఫోన్ లో చాలా సార్లు మాట్లాడ కానీ...కలిసే అవకాశం రాలేదు...నేను ఆఫీస్ కి వెళ్ళడం....వలన కలిసే అవకాశం రాలేదు...


ఇంకా ఎంటి....చెప్పు .....


ఎం లేదు ఆంటీ....మీరు రమ్మని చెప్పారు అని అన్నారు ...

వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు.. అందుకే...

హ్మ్మ్....అందుకే....

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని......


సరే...లే...ముందు...కూర్చో...తింటూ మాట్లాడుకుందాం....అన్నం వడ్డించింది.... నలుగురు అంటే....రమా... ఈషా....అబ్బాయి.... ఆంటీ...రమా...ముందే కొంచం తిన్నది కాబట్టి...కొద్దిగానే వేసుకుంది....


మీరూ... ఇద్దరూ మేజర్స్ కాబట్టి....మేము వద్దు అని చెప్పిన....ఎవరు చెప్పిన...మీరు వినరు... ఇంకా...ఈ కాలం పిల్లలతో పోలిస్తే ....మీరు బెటర్ అనే చెప్పాలి...పెద్దవాళ్ల అభిప్రాయం అయిన అడుగుతున్నారు....అందరూ...అనుకోగానే పెళ్లి చేసుకొని...కష్టాలు రాగానే విడిపోతున్నారు....


కానీ....ఒక చిన్న మాట....ఏంటంటే....పెళ్లికి ముందు వున్నట్లు....తర్వాత వుండకపోవచ్చు....

..ఇంటి బాధ్యతలు తీసుకోని,వంట పని, ఇంటి పని చేస్తూ అందం పై శ్రద్ధ పెట్టలేదు...నికు అందం గా కాక అందవిహీనంగా కనపడవచ్చు...అప్పుడు నువ్వు యిపుడు వున్నట్లు ఫ్రీ గా వుండక పోతే...తను చాల బాధ పడే అవకాశం ఉంది....అమ్మ వాళ్ళ ఇంట్లో గారాబం గా పెరిగి వుంటుంది...పనులు అన్నీ సరిగ్గా చేయలేదు కావచ్చు కొన్ని రోజుల తర్వాత తానే స్వయంగా నేర్చుకుంటుంది....ఎం రాదు అని అంటుంటే చాలా బాధపడుతుంది....పనికి వెళ్లి వచ్చాక నువ్వు కాస్త రిలీఫ్ ఇస్తుంది అని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలనుకుంట్...తను ఇంట్లో ఒక్కతే వుంటుంది...బోరే కొడుతుంది అని అనవచ్చు...దానితో మనసుపర్థలు రావచ్చు....జీవితం లో స్నేహితులు ముఖ్యమే....ఎప్పుడు వస్తా వు అని నువ్వు తొందర పెట్టద్దు.... నా కోసం ఎదురు చూస్తూ వుంటుంది అని నువ్వు ఆలోచించాలి.....ఒక్కో సారి ఆరోగ్యం బాగుండక పోతే పనుల్లో సహాయం చెయ్యి ...తన ఆఫీస్ పనిలో నికు ఏదయినా పని వస్తె నువ్వు సహాయం చెయ్యి...అన్నింటికంటే ముఖ్యంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోండి...ఒకరు పై ఒకరు....అది లేకుంటే ఎన్ని వున్నా వ్యర్థమే....

మరో విషయం....డబ్బు....ఎంత ప్రేమ వున్న...ఆర్థికంగా యిబ్బంది వుంటే.... నిస్సాయత వలన కోపం...కోపం వలన మనస్పర్థలు...వస్తూ ఉంటాయి....మీ ఇద్దరికీ వచ్చే డబ్బులు...దుబారా ఖర్చులు చేయకుండా...పొదుపు చేస్తే...పెళ్లి అయ్యాక....పనికి వెళ్లగలవు కానీ...పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాలు వెళ్ళలేవు....అప్పుడు ఉపయోగ పడుతుంది....


అన్నిటి కంటే ముందు సంతోషం....అది కావాలంటే...ముందు నీ మనసు ప్రశాంతంగా....వుండలికథ....మరి నువ్వు ఇంట్లో వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకున్న తరువాత....ముందు కొత్త కాపురం బానే ఉంటుంది...తర్వాత నువ్వు ఎం చేస్తున్న ఇంట్లో వాళ్ళు గుర్తస్తు వుంటారు....అప్పుడు చాలా బాధ పడతావు...


మీరు ...అనుకోవచ్చు....ప్రేమ పెళ్లి లు ఎంత మంది చేసుకొని సంతోషం గా లేరు.... యిన్ని చెప్తుంది ఎంటి అని....నిజమే....కానీ...మీ మంచి కోరుకొనే దాన్ని కాబట్టి....ముందు...మీరు ఆర్థికంగా స్థిర పడండి....ఇద్దరి చదువులు పూర్తి అయ్యాయి....రమా కి జాబ్ వచ్చింది....కానీ ఇంకా....వెళ్ళాలి....అది....నచ్చలి....

నువ్వు బానే చదుకున్నవ్....నికు ఒక ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్లి మీ ప్రేమ విషయం చెప్పండీ....అప్పుడు కాదు అంటే...నేనే దగ్గర వుండి చేయిస్తా.....

ఇంత చిన్న విషయం నేను మీకు చెప్ప వలసిన అవసరం లేదు అనుకుంటా....కానీ నన్ను అడిగారు కాబట్టి చెప్తున్న....యిక మీ యిష్టం....


కాసేపూ...ఇద్దరు మౌనం గా ఉండిపోయా రు....


తరువత.... ఆంటీ...మీరు చెప్పింది కరెక్ట్ అని పిస్తోంది...మేము కొంచం సెటిల్ అయ్యాక చేసుకుంటాం...


చాలా మంచిది.....



.....కొన్ని రోజుల తర్వాత.......


అద్దం లో చూసుకుంటూ...రమా చాలా ఏడుస్తుంది...నాకే ఎందుకు యిలా అవుతుంది...అందరూ చెప్పే ఉచిత సలహాలు వింటే ఇలానే జరుగుతుంది....నాన్న ఏమో పెళ్లి చూపులు కూడా లేకుండా...ఏకం గా ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేశారు....యిప్పుడు ఎం చేయాలి....నాకు సాయంత్రం తెలిసినప్పటి నుంచీ ఫోన్ చేస్తున్న...తన ఫోన్ కలవడం లేదు....

.....రమా.....రెడీ... అయ్యవా....డోర్ తియీ....

వచ్చి డోర్ తీసింది....తల కిందికి దించుకొని...వల్ల అమ్మ పిన్ని వల్ల తో పాటు వెళ్లి కూర్చుంది ...పక్కనే వున్న తన చెల్లి...బావ నీ చూడు అక్క....చాలా హాండ్స్ గా వున్నాడు....అని అంటుంది....

రమా కి ....ఏడుపు ఆగడం లేదు....ఒక్కసారి గా లేచి... అపండి....నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు....అని లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని....ఫ్యాన్ కి చీర కట్టి...చనిపోవాలని నిర్ణయించుకుంది.....అందరూ బయట నుంచి తలుపుని నెట్టు తున్నారు....


.....కాసేపు తరువాత......


కనులు తెరిచి చూసిన రమా కి చుట్టూ తెల్లని పొగ కనపడింది....ఎంటి అసలు నొప్పి కూడా తెలియకుండా చనిపోయను....మబ్బులు ఎంటి ఇంత పలుచగా వున్నాయి....నేను యిప్పుడు స్వర్గం లో వున్నా నా.... అయ్.....స్వర్గం లో కూడా మంచాలు ఏర్పాటు చేసారు....అప్డేట్ ఆయ్యారు అన్న మాట... వీళ్ళు ఎవరు పొగను దాటుతూ ముందుకు వస్తున్నారు ...వామ్మో....కొంపదీసి దయ్యాలు అయితే కాదు గా....అయిన నేను చనిపోయాక నే గా ఇక్కడి కి వచ్చింది... అయినా ఎందుకు బయం అవుతుంది.... బాబోయి....నన్ను ఎం చేయద్దు ....ఆ.....అమ్మ....(మనకు బయం అయినా....దెబ్బ తగిలిన.. ముందు మనం పలికే మాట....అమ్మ...తను అక్కడ వుంటే పరిగెత్తుకు వస్తుంది...కానీ అమ్మ మనతో లేనప్పుడు కూడా అదే మాట వస్తుంది కథ ....)

రమా ....రమా....ఎం అయింది....

రాఘవ...నువ్వు కూడా చనిపోయవ.... నా కోసం వచ్చేశవ.....అని అంటూ హగ్ చేసుకుంది....

వెనకే వాళ్ళ కుటుంబం అంతా....

నాకోసం అందరూ చనిపోయారా....ఎందుకు ఇలా చేశారు మీరు....మీరు సంతోషం గా వుండాలి అని కథ..నేను చనిపోయింది....మరి మీరు ఎందుకు ఇలా చేశారు....అని ఏడుస్తుంది...

వారిని తోస్తు ముందుకు... ఈషా... వాళ్ళ అమ్మ వచ్చింది... ఆంటీ మీరూ....అని అంటుండగనే....


రమా....యిప్పుడు ఎలా వుంది....

అన్నయ్యా గారు...పిల్ల సడెన్ గా ఎంగేజ్ మెంట్ అనే సరికి బయపడి నట్టు వుంది....కాసేపు అబ్బాయితో మాట్లాడుకోనివ్వండి పదండి అని అంటూ...రాఘవ వంక చూస్తూ అందరినీ తీసుకెళ్ళింది....


..........గదిలో.......


రమా.... అర్ యూ ఒకే నౌ.....

నో............

అసలు ఎంటి....మనం చనిపోలేద.........

ప్రశ్నార్థకంగా పెట్టినా రమా మొహం చూస్తూ.....ఓ పొట్టి పిల్ల....నన్ను పెళ్ళి చేసుకోకుండా నే చనిపోయి....తప్పించుకు పోధం అని అనుకున్నావా....నీకు అంత అదృష్టం లేదులే అని వెటకారం గా అన్నాడు....

ఒరేయ్ ఇడియట్.....చంపేస్తా...ఈ టైమ్ లో జోక్స్ చేస్తే...... నిన్న టీ నుంచీ ఫోన్ చేస్తున్న....లిఫ్ట్ చేయవ్ ఎంటి....నీకు అసలు నేను అంటే లెక్క లేదు....

అమ్మ తల్లి..... నీకో దండం....నీ తిట్ల పురాణం కి మరో దండం....ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సరికి లేట్ అయింది....అంతే కాదు...నికు ఒక చిన్న గిఫ్ట్....అని మెడలో డైమొండ్ నక్లేస్ వేసాడు....

అది చూసి....ఒక్క సారిగా అవక్కు అయింది....(నగలు చూస్తే ఎప్పుడు అయిన షాక్ అవుతారు లే మీ ఆడవారు అని అనుకోకండి)ఎందుకు అంటే...

రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ గారు ...మొదటి సారి వాళ్ల నాన్న ఇంట్లో లేరు అని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ గారికి పరిచయం చేసినప్పుడు....నిన్ను నేను నా కోడలిగా అంగీకరిస్తున్నను అని అన్నట్లు గా తన మెడలో వేసిన హరం.... వాళ్ళ ఇంట్లో ఎవరయినా చూస్తే ఇంత విలువ అయిన హరం ఎక్కడిది అని అడుగుతే ఎం చెప్పాలో అర్థం కాక.... దాయలనే నేపధ్యంలో గదిలో సెల్ఫ్ పై దాచి ...పోగొట్టుకుంది....ఎవరినయినా అడుగుదాం అంటే....నికు ఎక్కడిది అని అడుగుతారు అని భయం తో అడగలేదు...తను లేని సమయం లో తన గది సర్దడం చేసే పనిమనిషి పై నే తన అనుమానం....కానీ ఎం చేయాలి....అడిగితే తను బయిట పడి పోతుంది....అందుకే నోరు అదుపులో పెట్టుకుంది....లేదంటే....తన చెవులు చటడు అంత అయిపొయేవి....తిట్ల పురాణం తో....


యి ... నక్లీస్ ఎక్కడిది రఘు....


నువ్వు ఇది పోయింది అని....చాలా బాధ పడుతుంటే ....నాకు మాత్రం సంతోషం గా ఉంటుందా....మా అమ్మ ఫోటో లో నక్లేసే ఫోటో చూసి....అదే డిజునే లో మళ్లీ చేయించి తిసుకచ్చ.....అందుకే లేట్ అయింది.... నా ఫోన్ ఆఫ్ అయింది....


అవును....అసలు నువ్వు ఎంటి ఇక్కడ....పెళ్లి కొడుకు వి నువ్వు అని తెలియక ....నేను చనిపోధం అని అనుకున్న....


క్షమించు బంగారం.... సపరైజ్ యిద్ధం అనుకున్న....కానీ నువ్వే నాకు పెద్ద సప్రైజ్ ఇచ్చావు.....సూసైడ్ అటెంప్ట్ ్ చేసి....

ఆంటీ....నే....నేను వాళ్ళ చిన్నమ్మ మనవడిని అని.... నా జాబ్ గురించి...మనం హెల్ప్ చేస్తున్న వీ లవ్ యూ ఫౌండేషన్ గురించి.....చెప్పింది.... సో...నేను మీ నాన్న గారికి నచ్చి....డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అని చెప్పారు....నికు నచ్చినట్లు వుండనిస్త.....అని చెప్పా...అయితే ఎం ప్రాబ్లం లేదు అని అన్నారు....నన్ను కూడా యిబ్బంది పెట్టను అని చెప్పారు...


అమ్మ...రమా...


ఆ...అమ్మ...వస్తున్న....


ఇంతకు మించి వుంటే ఎం అయిన అనుకుంటా రు.....


సరే....పదా అని బయటకి వెళ్ళారు....


అబ్బాయి.... నచ్చడా అని అడిగిన వాళ్ళ అమ్మ అడిగిన మాటకి...చిన్న సమాధానం గా చిరున్నవ్వు చిందింది......పెళ్లి బాజా మోగింది......


పెళ్లి తర్వాత రాఘవ....ఎదురు చూస్తున్న ఆ గడియ రానే వచ్చింది..



మల్లే పుల గుబాళింపు....పందిరి మంచం....మర్ధల్ల ఆకతాయి అల్లర్లు.....బయట చిన్నగా అప్పుడే ప్రారంభం అయిన తొలకరి జల్లులు....కిటికీ నుంచీ చల్లని గాలితో .... పడుతున్న చిరు జల్లులు.....


లోనికి రానే వచ్చింది....తన స్వప్న సుందరి.....పాల గ్లాసు తో.....


సిగ్గు పడుతున్న తన సుందరి వంతకు చేరి మెల్లిగా తన ముఖాన్ని పైకి లేపి....


ఆడపిల్లలు సిగ్గు పడాలి....నీలాంటి అబ్బాయిలు కాదే....

ఒరేయ్.....చంపేస్తా....అని చేతులు కొట్టడానికి పైకి లేపి...చేతిలో పాల గ్లాసు వున్నది గుర్తు వచ్చి ఆగిపోయింది....


నిన్ను చూసినప్పుడే....నీ అందం తో చచ్చి పోయా....మళ్లీ ఎలా చంపుతావే....అన్ని పెళ్లి అయ్యాకే అని...కనీసం నన్ను ఒక సారి కూడా ముద్దు కూడా పెట్టుకొనివ్వలేదు....కనీసం యిప్పటికయిన కరునిస్తవ లేదా....

రాఘవ వంక చూస్తూ చిన్న నవ్వు ......


తొలకరి వర్షం లో....

ఇద్దరి తొలి రేయి గడిచింది....


..... ...... ....... ....... .....


ఉదయం ......


రమా.....రమా.....


సిగ్గు భయం....తెలియని హడావిడి....ఒకరకమయిన గాబరా.....జుట్టు వేసుకొని బయటకి వెల్దాం అంటే పొడవాటి జుట్టు వేసుకొని సరికి గంట పట్టుద్ధ్హి.....అని....చేతితో జుట్టు కొంచం సరి చేసుకొని....కిందికి మొహం వేసుకుని తలుపు తీసింది.....


వెళ్లి స్నానం చేసి రా అమ్మ...టిఫిన్ రెడీ అయింది....


అలాగే అని.....స్నానం ముగించి.....గదిలో చీర కట్టుకుంటోంది.... వెనక నుంచి అమ్మ వచ్చి వారి అత్తమ గారి హరం నీ తన మెడలో వేస్తూ....(అమ్మ దగ్గర ఎది దాగదు....నువ్వు అడుగుతావేమో...విషయం నువ్వే చెప్తావు అని ఎదురు చూసా....)అల్లుడు చాలా మంచి వాడు.....వేళ్ళు నీ కోసం ఎదురుచూస్తున్నాడు....

నువ్వు ప్రేమించిన....అందరిలా పారిపోకుండా....మా తోనే పెళ్లి జరిపించుకొని వున్నవూ చూడు నాకు చాలా గర్వంగా ఉంది అమ్మ....

ఆ మాట విన్న రమా....గుండెల్లో గునపం గుచ్చినట్లు అయింది ....మనసులోనే ఆంటీ కి థాంక్స్ చెప్పుకొని.... వాళ్ళ అమ్మ నీ గట్టిగా హగ్ చేసుకుంది.....





Rate this content
Log in

Similar telugu story from Romance