Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అదృష్టం

అదృష్టం

1 min
2


కలనైనా నా ప్రేయసి..ముద్దిస్తే అదృష్టం..! 

కలహంసల సందడితో..మరపిస్తే అదృష్టం..!


మరులవీణ నామనసే..తనసొంతం నిజానికి..

తన ఒడిలో సేదదీరు..వరమిస్తే అదృష్టం..!


కాలాలకు ఊయలగా..ఉన్నది తన హాసమే..

చెలిమిపూల పల్లకిలో..చోటిస్తే అదృష్టం..!


మేఘరాగ రంజనియే..ఆలపించు జాణలే..

ప్రతిచినుకుకు సోహమ్మను..చనువిస్తే అదృష్టం..!


బంధాలకు అతీతమౌ..సరసస్వర ధారయే..

అనునిత్యం వేదాంతపు..వెలుగిస్తే అదృష్టం..!


ఎగురుతున్న గాలిపటం..నమ్ముకున్న ఇల్లేది.. 

నిప్పుపూల మబ్బుచాటు..మెఱుపిస్తే అదృష్టం..!



Rate this content
Log in

Similar telugu poem from Romance