Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అర్థమౌను

అర్థమౌను

1 min
385



పువ్వు చాటు మొగ్గమొగ్గ హృదయమెవరి కర్థమౌను..!?

కాపు కాచు ముల్లు మనసు కష్టమెవరి కర్థమౌను..!?


అరుణారుణ రాగాలను పరిమళించు మౌనరాశి..!

విందుచేయు లేతగాలి భావమెవరి కర్థమౌను..!?


ప్రేమ తెలియ జేసేందుకు తనను త్రెంచ తగదన్నది..!

తగవాడగ వల్లకాని స్నేహమెవరి కర్థమౌను..!?


హరితామృత వనరాశిగ మనసుమనసు ఎదగాలట..!

ఆకు ఆకు ఎదలోయల స్వప్నమెవరి కర్థమౌను..!?


ముద్దులాడు చినుకెప్పుడు యుద్ధానికి దిగుతుందో..!?

ఉప్పెనలకు తల్లడిల్లు తత్వమెవరి కర్థమౌను..!?


ఆ స్వార గానానికి పరవశించి రాలిపోవు..!

శక్తినిడే తల్లివేరు మూలమెవరి కర్థమౌను..!?


Rate this content
Log in

Similar telugu poem from Romance