చేయబోకు
చేయబోకు
ప్రాణమునే వీడిపోకు గాయమెపుడు చేయబోకు
బంధమునే దాటిపోకు కలతనెపుడు పట్టబోకు
గానమునే విరిచిపోకు పాటనెపుడు మరువబోకు
కాంతమునే ముట్టిపోకు బాటనెపుడు వదలబోకు
కాలమునే కప్పిపోకు గాలమెపుడు వేయబోకు
తాపమునే కలిపిపోకు మాయనెపుడు చేరబోకు
శాంతమునే నెట్టిపోకు యుద్ధమెపుడు మోయబోకు
నేరమునే తట్టిపోకు ముళ్ళనెపుడు తొక్కబోకు
సాయమునే మానిపోకు నడతనెపుడు విడవబోకు
మూలమునే చెదిపిపోకు మాటనెపుడు జారబోకు