చెలియా తనువు
చెలియా తనువు
చెలియతనువులో సొగసుల గనులను శోధించాలే
తీయని కలలను మోసిన కనులకు చూపించాలే
బుగ్గల విరిసిన గులాబిపూలను లెక్కించాలే
ముళ్ళకు వెఱవక అల్లరి చూపులు గుప్పించాలే
తనతో సమమగు సుందరి లేదని చెలికి చూపాలి
విహరించేందుకు మబ్బులపల్లకి తెప్పించాలే
అలిగినవేళల కన్నులు నిప్పులనెన్నిచెరగునో
వెన్నెలమాటలు చల్లి వేడిమిని తగ్గించాలే
పాలూ నీరై కలిసినప్పుడే నడుమనుంటుంది
శ్వాసల గంధముతో చిరుగాలిని అర్థించాలే
వియోగానికీ సంగమానికీ విరోధమున్నది
జడలో మల్లెల సాయంతోనే ఓడించాలే
తానుండే గుడి కూల్చుట తప్పని
పలుగును పట్టిన కాని కాలాన్ని ఒప్పించాలే