Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Romance Action

4  

Dinakar Reddy

Abstract Romance Action

చివుక్కుమంది

చివుక్కుమంది

1 min
1.0K


అప్పుడే నువ్వు నా చెవి కొరికినట్టు

సూది బెజ్జంలోకి దారం ఎక్కిస్తుంటే దూరినట్టు

ఎలానో ఉంది


ఎముక మూలుగలోని గుజ్జును

నువ్వు తీసి నాకు తినిపిస్తున్నట్టు

కౌగిట్లో నా ఎముకల్ని పొడి చేస్తున్నట్టు


అందానికి నేను నిర్వచనం చెబుతుంటే

నువ్వు నాలుక బయట పెట్టి వెక్కిరించినట్టు


అప్పుడే ఇడ్లీలు తీస్తున్న నా చేతిని

నువ్వు ముద్దాడినట్టు

పొడవాటి నీ జుత్తుతో

నా వేళ్ళు కబుర్లు చెప్పినట్టు


జుంకాలు లేని చెవులకు కొత్త సవ్వడి నేర్పినట్టు

కడిగిన ప్లేట్లో ముఖం చూసుకున్నట్టు

నేను వెళుతుంటే నువ్వు తలుపు మూస్తూ

కన్ను కొట్టి నన్ను కవ్వించినట్టు


పాత హిందీ పాట పాడుతూ

నువ్వు మిద్దె మీద వడియాలు ఆరబోస్తున్నట్టు

నేను చెమటతో పోటీగా నీ ముఖాన్ని తాకినట్టు


ఏంటో ఈ ఊహలు

అన్ని చోట్లా నువ్వే ఉన్నట్టు అనిపించి

మనసు చివుక్కుమంది

ఆలోచనల చిక్కులు తీస్తున్నప్పుడు 

బాధ అనే పేను కనబడి నా గోళ్ళ మధ్య పుటుక్కుమంది.


Rate this content
Log in

Similar telugu poem from Abstract