ఏనాటికొ
ఏనాటికొ
చిరునవ్వుల వీణ తనై..కరుణించుట ఏనాటికొ..!?
అమృతప్రేమ రాగాలను..వడ్డించుట ఏనాటికొ..!?
మేలమాడు వసంతమే..అచ్చెరువున నిలిచిందే..
తన అలుకల పట్టు కాస్త..సడలించుట ఏనాటికొ..!?
చెలియందెల సందడింటి..వినోదమే విందు కదా..
చెలిమిమీర చెంతజేరి..మురిపించుట ఏనాటికొ..!?
తను విసిరిన దుపట్టా..కన్నులెదుటి ఆకాశం..
తీపివలపు సంకెళ్ళను..విడిపించుట ఏనాటికొ..!?
వేదించే కలలవనం..గమనించక పోయేవా..
బలహీనత గుట్టుపట్టి..వదిలించుట ఏనాటికొ..!?