Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

గాయత్రీ దేవి

గాయత్రీ దేవి

1 min
269

*గాయత్రిదేవి*

ధ్రువకోకిల.

వెలుగు నింపెడి భానుతేజమ!

వేదవిద్యకు మూలమై

చిలుకు చుందువు జ్ఞానధారను

శ్రీకరీ!సురసేవితా!

తళుకుమంచును మానసంబున ధర్మ బుద్ధిని నిల్పుమా!

దలిచినంతనె జ్ఞానభిక్షను తల్లి!మాకిడి బ్రోవుమా!//

*ధ్రువకోకిల*

ప్రణవరూపిణి!లోకనాయకి!పాంచభౌతిక తత్త్వమా!

మునులు యోగులు నిన్ను గొల్తురు మోక్షదాయిని!సంధ్య!నా

కనుల నిండుగ మాయ గ్రమ్మెను కౌళినీ!నను కావుమా!

వినయమొప్పగ సేవ జేసెద విద్య నీయుమ!పద్మినీ!//

తేటగీతి.

మంత్రగాయత్రి!మాతరో!మనికి నిల్పు!

సంధ్యగాయత్రి!మాకిడు శాంతగుణము

వేదగాయత్రి!వైదిక విద్యనొసగి

కరుణతోడ మా వంశముల్ గావుమమ్మ!//

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Rate this content
Log in

Similar telugu poem from Classics