గుండె మంట
గుండె మంట
మబ్బు నీరై జారిపోయెను!
మట్టి పసిడిగ మారిపోయెను!!
సూర్యు డెంతగ రగిలి పోయెనొ!
కటిక చీకటి పారిపోయెను!!
చెట్లుపూలను నేలరాల్చెను!
తల్లి బాకియె తేరిపోయెను!!
వెదురు ఎండెను, చీలెనాపై!
గాన మాధురి మీరిపోయెను!!
వన్నెలేలనొ సూర్యకాంతికి?!
వాన చినుకున దూరిపోయెను!!
మంచుకొండనె కరిగె దయతో!
మొలక దప్పిక తీరిపోయెను!!
కలువ కోరెను చందమామను!
కలగ కొలనున చేరిపోయెను!!
కలయె నిజమై ఎదురు వచ్చెను!
కంటి పాపలె బీరిపోయెను!!
కంటనీరే కారిపోయెను!
గుండెమంటలు ఆరిపోయెను!!
... సిరి ✍️❤️