Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
2

'హరీ!'శతకపద్యాసములు.

59.

ఉత్పలమాల.

సారసలోచనా!యనుచు సన్నుతి సేయగ మౌనులెల్ల సొం

పాఱెడు మోము తోడ నగి ప్రక్కన జేరిచి మాటలాడి నీ

పేఱిమి చూపువాడ!నను ప్రీతిగ గాంచెద వంచు నార్తితో

చేరితి నీదు సన్నిధికి చిల్కవె నీదరహాసమున్ హరీ!//

60.

ఉత్పలమాల.

నారద తుంబురుల్ సురలు నమ్రతతోడ భజించవచ్చినన్

కూరిమి మీర తీర్తువట కోర్కెలు ప్రేమగ జేరదీయుచున్

దారిని తప్పితిన్ వరద!దండన జేయుమ!యొజ్జవై వెసన్

దోరపు బుద్ధి నీయవయ!దుర్గుణమంతయు దొల్గగన్ హరీ!//

Rate this content
Log in

Similar telugu poem from Classics