ఈ సంధ్యవేళ
ఈ సంధ్యవేళ
ఈ సంధ్యన నెలవంకై వస్తావని అనుకోలేదు..!
ఈవంకన నా వంకే చూస్తావని అనుకోలేదు..!
ఓటమెంత బాగుందో మరలిరాని జ్ఞాపకంలా..!
మధుశాలలొ నా కన్నులు మూస్తావని అనుకోలేదు..!
చిలిపితనపు సంద్రాలకు చిరునామా నీ మౌనం..!
గుండెగూటి కోకిలవై కూస్తావని అనుకోలేదు..!
చీకటెన్ని చిత్రాలను వడ్డిస్తుందో కలవాకిట..!?
కురుల గంధమీ పేదకు పూస్తావని అనుకోలేదు..!
విరుల మరుల వింతనాట్య విన్యాసము చూడలేదు..!
ఇంతలోనె ప్రేమలేఖ వ్రాస్తావని అనుకోలేదు..!