జ్ఞాపకమే ఉన్నది
జ్ఞాపకమే ఉన్నది
జ్ఞాపకాల మోహమేమొ..చుట్టేస్తూ ఉన్నది..!
చెలిచూపుల వర్షమేమొ..కాల్చేస్తూ ఉన్నది..!
పిల్లగాలి వయ్యారపు..అల్లరెంత మధురం..
చెప్పలేని భావనమే..పట్టేస్తూ ఉన్నది..!
తన అడుగుల జాడలలో..వేనవేల కాంతులు..
చెలి అందెల సవ్వడేమొ..కట్టేస్తూ ఉన్నది..!
జన్మలెన్ని ఎత్తానో..అవసరమా ఇంకా..
శ్రీచందన పరిమళమే..ఊపేస్తూ ఉన్నది..!
ఆనందం వెలుపలెచట..దొరికేనో ఏమో..
వెతుకులాట మనసునేమొ..తొలిచేస్తూ ఉన్నది..!
ప్రేమకన్న సత్యమేది..లేదన్నది నిజమే..
చెలిఊపిరి తాడేమో..నవ్వేస్తూ ఉన్నది..!