Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

లోకమాత

లోకమాత

1 min
267


*లోకమాత*


విశ్వరూపిణీ!రావమ్మ!విజయ దుర్గ!

మహిషునిన్ సంహరించిన మహితశక్తి!

విజయదశమిన పూజించి వేడ్కమీర

భక్తులందరు ప్రేమతో పరవశించి

మ్రొక్కు బడులను చెల్లించి పుణ్యమలర

నీదు సన్నిధి యందున నెనరుతోడ

స్తుతులు స్తోత్రాలు పాడుచు సొక్కుచుంద్రు.


ఆశ్వయుజ శుద్ధ దశమిన నద్భుతముగ

దర్శనంబునొసంగెడి తల్లి!నీకు

తీపి పొంగళ్లు పెట్టుచు తెల్లవార్లు

నుత్సవంబులు చేయుచు నుంద్రు జనులు.


భోగభాగ్యాలు కురిపించి పుణ్యమిడెడి

లోకమాతవు!మమ్ముల సాకుచుండి

వరములెన్నియో కురిపించు భధ్రవమ్మ!

తల్లి!ఇంద్రాది దేవతల్ తన్మయముగ

పాదరేణువులై దరిన్ బడుచునుంద్రు

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ ప్రణతు లిడుచు

దాసులై తరియింతురు తనువు మరచి

భువన మేలెడి తల్లి!నిన్ ముక్తికోరు

మునుల కిడుదువు మోక్షంబు మురిసిమురిసి.


యోగ శక్తిగా ప్రాణుల యూపిరందు

తిరుగుచుందువు మాయంబ!శ్రేయమొసగ

తల్లి!నీదు మహిమ తెల్ప తరమమాకు?

కావ్యముల్ రచియించుచు కవులు నీదు

కథలు పాడుచు నిల్చిరీ కాలమందు

శాశ్వతులగుచు జగతిలో చరితనిల్పి

యట్టి నీగుణ గానంబు నమిత భక్తిఁ

నిమిష నిమిషము జేయుచు నిష్ఠతోడ

పాహి!పాహి!యటంచునీ పదములకడ

శిరము వంచుచు మ్రొక్కెద శరణమమ్మ!//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


Rate this content
Log in

Similar telugu poem from Classics