Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మా ఊరే

మా ఊరే

1 min
5



అనుబంధపు విరి ఊయల అందమైన మా ఊరే..!

అనురాగపు వెన్నెలవని స్వచ్ఛమైన మా ఊరే..!


కన్నతల్లి మమకారం ప్రవహించును గాలిలోన..!

ప్రాణనిధుల పంటతల్లి అద్దమైన మా ఊరే..!


అమ్మమ్మలు..నాన్నమ్మలు..తాతయ్యల ఆత్మీయత..!

మరపురాని ఆనందపు క్షేత్రమైన మా ఊరే..!


పప్పన్నం..ఆవకాయ..పాలు పెరుగు..వెన్నపూస..!

లోటు లేని స్వర్గాలకు లోకమైన మా ఊరే..!


ఈ హాస్టల్ జీవితాన మీ చెలిమియె నా ఊపిరి..!

అన్నలార చూస్తారా నేస్తమైన మా ఊరే..!


రాగింగుల గొడవలేల..అవగాహన వాకిళ్ళట..!?

అక్కలార చూడలేర దివ్యమైన మా ఊరే..!?



Rate this content
Log in

Similar telugu poem from Romance