Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

మనసు మరీ..

మనసు మరీ..

1 min
340


ప౹౹

మనసు మరీ హత్తుకొని తూలిపోతుందే అలా

సొగసు చేరి పొత్తు కోరి అల్లాడిపోతుందే ఎలా ౹2౹


చ౹౹

కలలో కూడ కవ్విస్తుందే కళ్ళతో మాట వినకా 

అలలా ఊపేస్తుందే అసలా చూపులతో కనకా ౹2౹

అణువులో అణువై అంకితమే చేసి పోతుందే

తనువులో తనువై తన్మయమై కలసిపోతుందే ౹ప౹


చ౹౹

పూల వారధి పున్నమి తీరమే తీరుగా చేర్చులే 

కలల సారధి ప్రయత్నం చేసి ఫలితం మార్చులే ౹2౹

మార్గమే చూపిన ఆమనికి మరిచిపోని సృతులే

స్వర్గమే దిగివచ్చి దీవించీ ఇచ్చిలే అనుమతులే ౹ప౹


చ౹౹

పండుగేలే పరువానికి పరువళ్ళతో పరిశ్రమించి 

దండుగే చేయకూ ఆ దరహాసాన్ని అదను లోనే   

                           విశ్రమించి ౹2౹

పరిఢవించే ప్రణయానికి పంకజాలై పల్లవించనీ  

అనుభవించే ఆశలను అంబుజాలై గమనించనీ ౹ప౹


                           


Rate this content
Log in