Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

4.2  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు సిక్కిం

నా పేరు సిక్కిం

1 min
268


నా పేరు సిక్కిం 

నేను హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్నాను

నాకు అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్నది

నేను పూర్వం "చోగ్యాల్" రాజ వంశీకుల

 స్వతంత్ర రాజ్యాన్ని

నేను భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైయ్యాను

నాకు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి

తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), 

ఆగ్నేయాన భూటాన్ దేశాలు,

ఉత్తరాన నేపాల్,

దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది

నా రాజధాని గాంగ్ టక్

నా అధికార భాష నేపాలీ

నా వృక్షము రోడోడెండ్రాన్

నా జీవనాడిగా భావించే నది తీస్తా నది

నా సరస్సులు త్సోంగ్మో , ఖెంచియోపల్రి సరసు

నా నృత్యం గుంఫా 

నా అధికార వార పత్రిక 'సిక్కిం హెరాల్డ్' 

నా మతాలు హిందు, వజ్రయాన బౌద్ధ మతాలు

నా వద్ద ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరం 

కాంచనగంగ పర్వతం విస్తరించి ఉంది

నా ఒడిలో 424 రకాల ఔషధ మూళికలు మరియు 550 పక్షుల జాతి రకాల నమోదయ్యాయి

నా భూభాగంలో 28 పర్వత శిఖరాలు, 

21 హిమానీనదాలు (గ్లేషియర్స్), 

227 ఎత్తైన ప్రాంతపు సరసులు, 

5 ఉష్ణజలపు ఊటలు, 

100కు పైగా నదులు, ఏరులు ఉన్నాయి. 

టిబెట్, భూటాన్, నేపాల్లతో కలుపుతూ 8 పర్వతలోయ మార్గాలున్నాయి

నా దగ్గర ఇండ్లు వెదురు మొక్కలతో నిర్మిస్తారు


నా పర్యాటక ప్రదేశాలు:

సంగ్నక్ చోలింగ్ మొనాస్టరీ బౌద్ధ సన్యాసి ప్రార్థన

గాంగ్టక్ రోప్వే, ఖాంగ్చెంజ్జోగా నేషనల్ పార్క్ 2016 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా జాబితా చేయబడింది, ఖాంగ్చెంజ్జోగో (ప్రపంచంలోని మూడవ అతి ఎత్తైన పర్వతం, లచుంగ్, లచెన్ మరియు యమ్తంగ్ లోయ, పెల్లింగ్ హెలిపాడ్ నుండి డాన్ వీక్షణ, రవంగ్లాలో టెంమీ టీ గార్డెన్


నా గురువైన గురు రింపోచే విగ్రహం ప్రపంచ

సాధువుల విగ్రహలన్నింటిలోకెల్లా పెద్దది

నా వద్ద ప్రసిద్ధమైన ద్రో-దుల్ ఛోర్తెన్ స్థూపము ఉంది

నా దగ్గర నుంచి టిబేట్ లాస నుండి "నాథులా" పర్వతమార్గం భారత్-చైనా యుద్ధం తరువాత మూసివేయబడింది.

గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో  22 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది



Rate this content
Log in

Similar telugu poem from Abstract