Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

నేనొక బహువచనాన్ని

నేనొక బహువచనాన్ని

1 min
295



అహర్నిశలు శ్రమించినా 

ఆగని హింసే మాకు బహుమానం

కలలకు దూరం, కన్నీళ్లకెప్పుడుకేరాఫ్ లం 

స్వంత చిరునామా మారిన మేము

మీతో ఏడడుగులు నడిచిన నాడే

కలసి మనం అనే బహువచనం గా మారితే 

ఇచ్చే బహుమానాలు, అబ్బో చాలాగొప్పవి


అయినా గౌరవానికేముందిలే

ముసుగేసిన ముల్లకిరీటమేగా

అసే,ఒసే రాయే,పోయె లే కదా

మాకు మీరిచ్చిన బిరుదులు

   

అచ్చోసిన ఆంబోతులల్లే విర్రవీగే 

మిమ్మల్ని మా గర్భ సంచి లో మోసి

పెంచి, పెద్ద చేసేది మేమే కానీ 

విచిత్రం ఏమిటంటే 

మా బతుకు పుస్తకాన్ని మీకు ఇచ్చి

మా శీలాల్ని ధృవీకరించే సంతకాన్ని

మీతో చేయించుకునే దుర్మార్గ వ్యవస్థ లో

బతుకుతున్న బందీలo

హోదాలో,సంపాదనలో ఒక మెట్టు పైనే మేమున్నా 

అన్ని తెలిసినా మీకేం తెలియదని వెక్కిరిస్తూ 

నోరు మూసుకొండని గదమాయిస్తే

గుడ్లనీరు లోలోపలే కుక్కుకొనే నిస్సహాయజాతి మాది 

లేచింది మొదలు ఉరుకులు పరుగుల పని

అష్టావధానిలా ఎన్నో రూపాల పరకాయ ప్రవేశం

కాలానికి కాస్త విరామముంటుందేమో

సగటు స్త్రీ మూర్తి కి లేదు విరామ నజరానా

 మీరు ఛీ, ఛ అన్నా మొహానా చిరునవ్వు పులుముకునే వేదనల్ని 

దిగ మింగే సహనవంతులం మేమే ఈసమాజంలో

మా రూపం ఒక్కటే ఎవరికీ ఏ పాత్ర కావాలన్న

ఆ పాత్ర లా మారే బహుముఖాలం, బహువచనాలం

గుర్తు పెట్టుకోండి....

మీ పాలిట మూర్తీభవించిన

 కల్పతరువులంమేము 

పెత్తనం మాత్రం మీకు తెలుసు

ప్రేమించడం మాత్రమే మాకు తెలుసు



Rate this content
Log in

Similar telugu poem from Classics