నేను-నాది
నేను-నాది
జరుగుతోంది జరుగుతీరు చూడకనే పోవడమే..!
"నేను-నాది" తెలిసికూడ తెలియకనే పోవడమే..!
పాలకులో సేవకులో..ఎవరిపాత్ర వారిదేను..
తీర్చదగిన జన్మరుణం..తీరకనే పోవడమే..!
సంతసాల ఊయలతో..అనుబంధం అద్భుతమే..
ఆనందపు మూలమేదొ..అందకనే పోవడమే..!
తాత్వికతకు అద్దంలా..ఉందిమనసు అణువణువున..
స్వచ్ఛమైన ఎఱుకతోటి..చేరకనే పోవడమే..!
రుచికరమగు మాటలతో..మిఠాయీలు బాగుండును..
ఉండదగిన మౌనములో..మునగకనే పోవడమే..!
తెల్లవారు లోగానే..రాలిపోవు పూవులెన్నొ..
పారిజాత పరిమళాలు..వదలకనే పోవడమే..!