నిదురిస్తున్న రేయి
నిదురిస్తున్న రేయి
నిదురిస్తున్న రేయి ఎదురుచూసేది ఉదయం కోసం
నిదుర లేచిన నా నయనం ఎదురుచుసేది నిన్ను చూసే క్షణం కోసం
అదరాలు కదిలేది మాటల సడి కోసం
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం
గుండె చేసే అలజడి ప్రాణం కోసం
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం
కరములు చలించేది అన్ని అవసరాల కోసం
నా చేతుల అవసరం నిన్ను దగ్గరికి తీసుకొనే వెచ్చని కౌగిలి కోసం
పాదాల పయనం జీవిత గమ్యం కోసం
నా అడుగుల గమనం నిను చేరుకొనే ఆస కోసం