నీ శ్వాసగా
నీ శ్వాసగా
అందాలకు అందమైన కలల తోట కణమంటే...!
కావ్యాలకు అందనట్టి కళల పంట కణమంటే...!
ప్రేమ లోతు చూడాలను కోరికెంత వెర్రిదసలు...!
సరసరాగ వీణియలకు వలపుకోట కణమంటే..!
మనసన్నది మధురమైన భావవేణు వవ్వాలోయ్..!
లోకాలను లాలించే చెలిమి ఊట కణమంటే...!
ఎన్ని రంగులెన్ని రుచులు ఎంచక్కా జారిపోవు...!?
మౌనగగన తారల మది పోంగు పాట కణమంటే..!
దృశ్య జగతి అదృశ్యము కనులు తెరచి మూయు లోపు...!
నిధులెన్నో దాచుకున్న చిలిపి కోట కణమంటే..!