Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ స్నేహం

నీ స్నేహం

1 min
334


పసిడివెలుగు పూలతోట విడువలేను నీ స్నేహం..!

క్షణానికో ప్రేమలేఖ విప్పలేను నీ స్నేహం..!


మోహమింత లేని చెలిమి పండించే అద్దమీవె..!

నీ చూపుల దారినింక వదలలేను నీ స్నేహం..!


మాటవరుస మాటలెంత గుబులు పుట్టించునో కద..!

ఈ జన్మకు పూర్ణశ్వాస కొలువలేను నీ స్నేహం..!


దాహమైతె ఆగమేఘ మౌతావుగ నా కోసం.!

తహతహలకు తగు ఊరట..మరువలేను నీ స్నేహం..!


ఎంత తిట్టిపోస్తున్నా నవ్వుతావె కిలకిలమని..!

ఎలా అలా ఉండటమిక..చూపలేను నీ స్నేహం..!


ఓ మనసా తెలుపవేర అడుగుటెలా కన్నులతో..!

సుస్వరాల తేనె పాట..దాచలేను నీ స్నేహం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance