నీ తలపే
నీ తలపే
వేణువలా ఊదేస్తూ మనసునిలా లాగేస్తూ
మాయేదో చేసేస్తావు....
రాలేదని ఎదురుచూస్తూ విసిగి
అలకబూనిన నన్నేదో మంత్రమేసి
అలిగిన విషయాన్నే మరిచేలా చేస్తావు...
విరహాల వేదనంతా ఒక్క చిరునవ్వుతో తీసేస్తావు....
అదేమీ చిత్రమో నన్ను బ్రతిమాలేందుకు
నువు చెప్పే తీయని మాటలకోసమైనా
నాకు అలగాలనిపిస్తుంది...
నీకన్నా ముందు నీరాకను తెలుపుతూ
నీమురళీరవం వినిపిస్తూ
మా చిరుకోపాలను కరిగించేస్తావు...
మాకళ్లలో నిన్ను చూడాలనే ఆతృత నింపేసి ప్రేమబాట వేసేస్తావు...
నీ ఒక్క చూపు చాలుకదా జన్మంతా
నీకై నిరీక్షిస్తూ గడిపేయడానికి...
ఓచిన్నమాట చాలులే ఊహల్లో బతికేయడానికి...
నను నడిపించేది బ్రతికించేది నీ తలపులే ప్రియతమా...
నీ తలపే అమృతమయం కదా...మాధవా...