నీవే కదా నా ప్రాణనాడి
నీవే కదా నా ప్రాణనాడి
నీ మాటలతో అలవోకగా
నా మనసును దోచేసావు ..
నీ పాటలతో అందంగా
నా హృదయ తంత్రులు మీటుతావు ..
నీకై నిరీక్షించే నా హృదయంలో
నీ రాగాల సుమధుర భావనాలెన్నో ..
నీ ప్రేమకై ఆరాటపడే నా మనసుకి
అంతులేని అనుభూతులు ఇంకెన్నో ..
ప్రియా నీవే కదా నా ప్రాణ నాడి
నీవే కదా నాలో ఈ ప్రేమ అలజడి
నీవే కదా నా హృదయంలో సందడి ..
శ్రీ ..
హృదయ స్పందన ..