నిశ్శబ్దంగా
నిశ్శబ్దంగా
నిశ్శబ్దంగా ఉన్నానంటే
సమస్త శబ్దాలూ వింటున్నాననేగా
ముఖప్రీతి కోసం చెప్పేవి
వెనుక ఆడిపోసుకొనేవి
కపటంతో గోతులు తవ్వేవి
మ్రుదు భాషితంలా ప్రేమించేవి
పటాకుల్లా చిట పటా పేలేవి రాలి ఎగిరి పడేవి
పడగెత్తే పాముల్లా బుసకొట్టేవి
ఆగ్రహ భాషలా రుస రుస లాడేవి
ఋణ ధ్వనులు చేసేవి
చీమ నడిచినా
దోమ ఎగిరినా
బల్లి తుమ్మినా
వినిపించేవి
భూగోళం తిరుగుతున్న దీర్ఘ శ్రుతి
గ్రహాల నిరంతర శబ్ధ చాలనం
వాయు మండల హుంకారం
నదీ నదాల ఝుంకారం
అవిరామ ఆదిమ రోదన
మానవ మ్రుగాల విజ్రుంభణల ఝణ ఝణ
పైశాచిక కేళి
విశ్రంఖలిత దశకంఠుడి తలల్లోంచి ఆగకుండా
వెలువడుతున్న వికటాట్టహాసం
మనిషి కాళ్ళ క్రింద భూస్కలనం
న్యాయదేవత కన్నుల్లోంచి ఉబికి ఉబికి
చిమ్ముకొస్తున్న కన్నీటి పాఠం
నిశ్శబ్ధంగా ఉన్నానంటే
సమస్తం గ్రహిస్తున్నాననేగా
ఆగ్రహంతో ఉన్నాననేగా...
.... సిరి ✍️❤️