ఓ మనసా విన్నావా
ఓ మనసా విన్నావా
మల్లెమొగ్గ మందారం..కలిసి పూసినాయేమో..!
మెఱుపుతీవ నీలిమబ్బు..కలిసి ఆడినాయేమో..!
అమృతమేదొ పంచేందుకు..దిగివచ్చిన జాణ తనా..
పిల్లగాలి కోకిలమ్మ..కలిసి పాడినాయేమో..!
పుడమితల్లి అనురాగం..కురిసేనా తన కన్నుల..
ఆవకాయ ఆమ్రరసం..కలిసి మురిసినాయేమో..!
పాలలోని వెన్నలాగ..ఉన్నదేను చెలి మనస్సు..
గుడిగంటల జడగంటలు..కలిసి మ్రోగినాయేమో..!
సన్నాయి కి సంగీతం..నేర్పేదే తన హాసం..
పంటకాల్వ మాగాణీ..కలిసి వెలిగినాయేమో..!
బావరాక తెలిసిందట..ఓ మనసా విన్నావా..
ఆనందం ఆ గగనం..కలిసి విరిసినాయేమో..!