ప్రేమ గొడుగు
ప్రేమ గొడుగు
నీడపడని నీ వెలుగే పూలగొడుగు పడుతున్నది..!
నీ మనసే నీతోడై పాటగొడుగు పడుతున్నది..!
వసంతాల డోలికలో గుచ్చుకునే ముళ్ళెన్నో..!?
సాహసమే నీ శక్తికి ఊటగొడుగు పడుతున్నది..!
అరవిరిసిన మల్లియలా భావనమే ఉంది చూడు..
మందహాస పరిమళమే పాలగొడుగు పడుతున్నది..!
దండలోని దారంలా చెలిమిసాక్షి కావాలిక..
మౌనవీణ సరాగమే మాటగొడుగు పడుతున్నది..!
బిందెలోని ఉంగరంతొ మొదలు కదా బ్రతుకుఆట..
చెలి చూపే అందమైన అలుకగొడుగు పడుతున్నది..!