ప్రేమ పావురాలు
ప్రేమ పావురాలు
ప్రేమసామ్రాజ్యపు రాజూ రాణి
నువ్వూ నేనే,
గుండెచాటు ప్రేమరాగంలో శృతిలయ నువ్వూనేనే,
చెదిరిపోని మధురజ్ఞాపకాల చెలిమి కలిమి నువ్వూనేనే,
ప్రేమలోతు చూడగలిగే
ఊహకాని నిజం నువ్వూనేనే,
నును సిగ్గుల చెక్కిలిపై
దోరవలపు విందుతో
లోకాన్ని మరిచేది నువ్వూనేనే.
చందమామలోని చల్లదనం మనసున నింపుకున్నది నువ్వూనేనే,
పరిమళించు
పారిజాత పుష్పంలా హృదయక్షేత్రంలో వున్నది నువ్వూనేనే,
సరసపు మాటల్లోని భావరాగంతో
మదిలోపల వేదన తీర్చుకుంది
నువ్వూనేనే,
అనురాగాన్ని మరిపించే
ప్రణయ సందడే
ప్రాణంగా చేసుకుంది నువ్వూనేనే,
నిత్య మంగళ ప్రేమకావ్యంలో
లోకాన నిలచిన
నాయకీ నాయకులం నువ్వునేనే,
రంగురంగుల పరిమళ పూలు ఎన్నున్నా
జగతిని ఏలే
ప్రేమపావురాల జంట నువ్వూనేనే