రంగుల మయం
రంగుల మయం
ఎన్నెన్నో వర్ణాలు మనసు దోచే అందాలు కదిలించే భావాలు
రకరకాల రంగుల సీతాకోక చిలుక అవసరార్థం రంగు మార్చే
ఊసరవెల్లి నీలి ఆకాశానికి రంగులద్దె ఇంద్రధనుస్సు
నలుపుకు అందం తెచ్చిన నల్లన్నయ్య తెలుపుకు మెరుపులు
అద్దిన జాబిలమ్మ ఆకుపచ్చ వర్ణంతో పులకరించే ప్రకృతమ్మ
ఒక్కో వర్ణం సుమనోహరం పైవాడి సృజనకు తార్కాణం
మనిషి స్వభావాన్ని తెలిపే రంగులు ఎరుపు కలిగించును
ఉత్తేజం పసుపుపచ్చ పెంచును ఆత్మ విశ్వాసం ఆకుపచ్చ నింపును
నూతనోత్సాహం నీలం ప్రశాంతతకు చిహ్నంప్రతీ రంగుకో ప్రత్యేకత చూపకు
దేనిపై విముఖత రంగంటూ లేకుంటే అంతా శూన్యం
చేసుకో జీవితాన్ని రంగులమయం...