Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శారద

శారద

1 min
352

1.

మత్తకోకిల.

భారతీసతి పాదయుగ్మము భక్తిమీరగ కొల్చినన్

జేరి విద్యనొసంగి బ్రోచును చిన్మయాత్మజ ప్రేమగన్

ధారగా కవితాసుధల్ వరదాన మిచ్చెడి దేవితాన్

కోరి భక్తుల మానసంబున కొల్వు చేయును ప్రీతిగన్.//

2.

 చంపక మాల.

సరసిజ నేత్రి విశ్వమున సామ శృతంబగు నాద రూపియై,

నిరుపమ వేదమూర్తి, ధరణీ పరిపాలకి, వర్ణ మాతృకై 

కరమున వీణ బట్టి మమ కారము చిల్కెడి వీక్షణంబుతో 

వరముల నిచ్చు భారతికి భక్తిగ మ్రొక్కెద నెల్ల వేళలన్ //

3.

ఉత్పల మాల.

తెల్లని తల్లి శారదయె

తీయని పల్కుల నందచేసి నా 

యుల్లమునన్ వసించి ముదమొంద కవిత్వము వ్రాయ నేర్పగన్

మెల్లిగ పద్య మల్లితిని

మేలునొ సంగెడి భారతీసతిన్

జల్లని చూపుల కావు మంచు మన సారగ దల్తును భక్తి శ్రద్ధగన్//

Rate this content
Log in

Similar telugu poem from Classics