శుభము
శుభము
గుర్తింపును గుర్తింపుకు..ఇచ్చుటచే శుభము..!
గాలినేలు దీపముతో..బ్రతుకుటచే శుభము..!
బాధలన్ని మోయుమనసు..చోటెవరికి తెలిసె..
జ్ఞాపకాల చిత్రాలను..వదులుటచే శుభము..!
చెప్పుకోను ఏమున్నది..అవగాహన గూర్చి..
ఆనందపు చిరునామా..పట్టుటచే శుభము..!
ఏ చెలియా ఎవరిగుండె..కోసుకెళ్ళి పోదు..
వెర్రితనపు వేర్లు పట్టి..కాల్చుటచే శుభము..!
ప్రతి గాయం స్వయంకృతం..ప్రతిపక్షం లేదు..
సత్యమిదే ఎఱుకలోన..నిలుపుటచే శుభము..!
నాయకులను ఎన్నుకున్న..వారెవరో ఏమొ..
ప్రజల బుర్రలోని చెత్త..పేల్చుటచే శుభము..!