Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

శ్వాసలో నే ఊసులు

శ్వాసలో నే ఊసులు

1 min
334



వెతలతోనె ఎదనింపకు …ఆశలనే ఆర్పేయకు  

చిరునవ్వులు చిదిమేయకు …చింతలలో తోసేయకు  


తోటమాలిగ బాసచేసి తొడిమనేల తుంచుతావు 

మది నవ్విన గురుతులనే మనుగడగా మలిచేయకు 


శ్వాస లోన ఊసులోన లయ తప్పని నీ ధ్యాసే

తిరిగి రాని సమయాన్నిల చితి లోనా కాల్చేయకు 


సందె వేళ గువ్వైనా గూడుజేరు విజయంగా 

కొండ కోన దాటి పోకు గుండె తలుపు మూసేయకు  


అందలాలు అందలేవు ఆశమీరి …అలసి పోకు 

ఆరిపోని ఆర్తి నింపి  తల వాకిట నిలిపేయకు!!


Rate this content
Log in

Similar telugu poem from Romance