Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

తల్లి ఋణము

తల్లి ఋణము

1 min
292



1.ఉత్పలమాల.

అమ్మపదంబులన్ గొలుతు నాదర మొప్పగ శ్రద్ధమీర మా

యమ్మకు నిత్తు ప్రేమమెయి హారతులన్ వినయంబుతోడ జే

జెమ్మకు మ్రొక్కి జేసెదను సేవలు ప్రీతిగ దాసిరీతిగన్

గమ్మని పద్యధారనిడి కావ్యము వ్రాసెడి శక్తికోరుచున్.//


2.ధ్రువకోకిల.

జగములేలెడి మాతృ మూర్తివి సాకుచుండుమ మమ్ములన్

సుగతి కోరుచు నీదు సన్నిధి జొచ్చి వేడితి మమ్మరో!

సుగుణ సంపద నిచ్చి బ్రోవుమ!చింతలన్నియు దొల్గగన్ 

వగను బాపుచు తీర్చుచుండుమ వాంఛితంబులు భారతీ!//



(తేటగీతి మాలిక )


పురిటి నొప్పులు పడుచుండి పుట్టుకనిడి

బిడ్డలందరిన్ గాచుచు ప్రీతితోడ

పెంచి పెద్దలన్ జేసెడి పెద్ద దిక్కు

తల్లి ఋణమును దీర్చెడి దారికలదె?

తల్లి సేవలన్ నిత్యము తలచుకొనుచు 

పెద్దతనమున తల్లిని ప్రేమమీర

కాపుగాసిన బిడ్డలే కలిమి యనెద.

స్తన్య మిడుచుండి బిడ్డలన్ సాకుచుండి

రక్తమాంసాదు లన్నియు రంగరించి

చదువు సంధ్యలు నేర్పుచు సంఘమందు

మంచి పౌరులుగన్ నిల్పు మమత పంచి

దైవరూపమౌ తల్లి పాదయుగమునకు

భక్తి మీరగా జేసెద వందనములు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics