SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

అన్వేషణ-7(ఓ మా"నవ" మృగానికై)

అన్వేషణ-7(ఓ మా"నవ" మృగానికై)

7 mins
471


అన్వేషణ-6(ఓ మా"నవ" మృగానికై) కి

కొనసాగింపు,

అన్వేషణ-7(ఓ మా"నవ" మృగానికై)

ఆ డైరీలో ఇంకేమి లేకపోవడంతో, నిరాశగా దాని మూసి పక్కన పెడుతున్న రంజిత్ కి...

"ట్రింగ్..

ట్రింగ్..."

అంటూ కాలింగ్ బెల్ శబ్ధం వినపడుతుంది.

దుప్పటి ముసుగులో ఉన్న రంజిత్ ఒక్కసారిగా ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసాడు..

(అవును మీరు విన్నది నిజమే!. అతను అప్పుడే నిద్రలోంచి లేచాడు. అంటే, ఇప్పటివరకూ జరిగిందంతా అతను కన్న కలన్న మాట.)

తను చదివిన ఆ డైరీ కోసం చుట్టూ చూసాడు. కానీ, అదెక్కడా కనిపించడం లేదు. తన కళ్ళు కూడా అప్పుడే నిద్రలోంచి తెరుచుకున్నట్టు మసకగానే ఉన్నాయి.

అప్పుడర్థమైంది రంజిత్ కి, "అదంతా ఆ రోజు రాత్రి తను కన్నది ఓ కలని.( ఆ ముసలాడు రావడం, తను ఏవేవో చెప్పడం, ఆ డైరీ నాకివ్వడం, అందులో ఉన్న విషయం అంతా నా ఊహేనా అనుకుంటూ నిస్పృహలో మునిగిపోయాడు). ఆ కాలింగ్ బెల్ శబ్దానికి తను తేరుకుని ఆ కల నుండి ఇప్పుడే బయట పడ్డాడని."

ఆ కాలింగ్ బెల్ సౌండ్ ఇంకా అలానే మ్రోగుతుండడంతో, అప్పటికే నిరాశలోనున్న ఏసిపి రంజిత్ విసుగుగానే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసాడు.

"ఛమించాలి బాబు గారు..

రాతిరికి మీరొచ్చినట్టు తెలవలేదయ్యా?

లేకపోతే, ఇక్కడే ఉండేటోడినండి!

తెల్లారి మా ఇంటిది సెప్పింది మీరోచ్చినట్టు, దానికెవరో సెప్పారంటా?

గభాలున లేసి, మీ వద్దకు పరిగెత్తుకుంటూ ఒచ్చాను." అంటూ చెప్పుకొచ్చాడు ఆ గెస్ట్ హౌజ్ పనోడు రంగయ్య.

"హుమ్ ...సర్ సర్లే!

"తలనొప్పి గా ఉంది, కొంచెం కాఫీ పెట్టు రంగయ్య" అన్నాడు రంగయ్య తెచ్చిన పాల ప్యాకెట్ ని చూస్తూ రంజిత్.

సోఫాలో కూర్చుని రంజిత్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

"అసలు రాత్రి జరిగిందంతా ఓ కల..!,

నా కళ్ళు ముందు జరిగినట్టుంది, అదంతా ఓ కల అంటే నమ్మలేకున్నాను.

ఎవరా సత్య నారాయణ?

ఎవరా సత్య కుమార్, సత్య కిరణ్, సత్య కృష్ణ, సత్య కాంత్?

ఏ కారణం లేకుండా, అసలేం పరిచయం లేకుండా వాల్లెందుకు నా ఊహల్లోకొచ్చారు?

ఆ హత్య కేసుల గురించి పదె పదె ఆలోచిండడం వల్ల ఇలా జరిగుంటుందా?

లేక, ఇవన్నీ నేనసలకే నమ్మని ఆ దైవం అందించిన ఆధారాలా?

ఛ.. ఛ.. ఇవన్నీ కాదు

అసలు ఏమైంటుందబ్బా...!".

అని నెత్తిన తన చేతిని పెట్టుకుని ఒకటే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రంజిత్.

"ఏమైందయ్యా..? ఇందాకటి నుండి సూత్తాన్నను, అదేపనిగా ఆలోచిస్తున్నారు!" అంటూ ఈలోపు కాఫీ పట్టుకొచ్చిన రంగయ్య అన్నాడు రంజిత్ ని అలా చూస్తూ.

"ఏం లేదు లే రంగయ్య!

ఈ మధ్య సిటీ లో మూడు మర్దర్లు జరిగాయి, నీకు తెలిసే వుంటుందిగా!, ఆ కేసు నా దగ్గరకి వచ్చింది, వాటి గురించే!" అంటూ రంగయ్య ఇస్తున్న కాఫీని తీసుకుంటూ అన్నాడు రంజిత్.

"ఏమొనయ్యా ...! మొన్నామధ్య ఎవరో అనుకుంటుంటే ఇన్నాను. పపంచ గేనం లేనొల్లం, ఆటి గురించి పెద్దగా పట్టించుకోం కదయ్యా..! మన పని మనదే" అంటూ బదులిచ్చాడు రంగయ్య.

"ఓహ్.. అది సర్లే కానీ,

ఈ పక్కన స్మశానంలో సత్య నారాయణ అనే కాటి కాపరి ఎవరైనా ఉన్నారా... రంగయ్య?" అని అడిగాడు రంజిత్.

దానికి బదులుగా...

"నాకు పెద్దగా తెలవదు కానీ, అక్కడొక పూరి గుడిసుంది ఆళ్ళది. అక్కడికెళ్లి అడిగితే ఇవరాలు ఏమైనా దొరకొచ్చేమోనయ్య!"

"సరే, ఒకసారి వెళ్లి కనుక్కుందాం పదా!" అంటూ రంగయ్యను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళాడు రంజిత్.

          

                        *******************

వాళ్లున్న గుడిసె దగ్గరకు వెళ్ళిన వాళ్ల(రంజిత్ మరియు రంగయ్య)కు అక్కడొక ముసలాయన, ముసలవ్వ కనిపించారు.

వాళ్ళు తప్ప అక్కడ మరెవరూ లేరు. రంజిత్ కి ఆ ముసలాయన రాత్రి తన కల్లోకి వచ్చినోడిలా ఏమీ కనిపించడం లేదు.

"ఇదిగో పెద్దాయన, ఈ సారూ.. ఓ పోలీసు!,

పక్కనే గెస్ట్ హౌస్ ఉంది కదా, అది ఈయనదే.

సారు గారికి, ఏవో మీ దగ్గర నుండి కొన్ని ఇవరాలు కావాలంట. తెలుసుకుందామని ఈడకు వచ్చారు." అంటూ మొదలెట్టాడు రంగయ్య ఆ ముసలాయనను చూసి.

"రండి దొర..! రండి..! (అంటూ రెండు చేతులు జోడించి వాళ్ళని ఆహ్వానించాడు రంగయ్య)

ఒసేయ్ ..కాంతం సార్ కి కొంచెం సళ్లగ ఏటైన తీసుకురా..!" అంటూ ఆ ముసలాయన తన భార్యతో అనబోతుంటే,

"అదేం ..వద్దులే పెద్దాయన!

ఒక కేసు విషయంలో నేనిక్కడికి ఎంక్వైరీకి వచ్చాను.." అని అన్నాడు రంజిత్.

"ఈ కాటి తప్ప, మాకు బయట పపంచంతో సంబంధం లేనోల్లం. నాకా ముసల్ది, దానికి నేను అంతే! ఉట్టిన్నప్పటి నుండి వారసత్వంగా నాకీ కాటే దిక్కు. ఈ కేసులు, గీసులు మాకెట్టా పట్టునయ్యా..." అంటూ కేసు అనగానే తన భయాన్ని వెళ్ళబుచ్చాడు ఆ ముసలాయన.

"అయ్యో..! ఏం కంగారు పడకండి, మీకేం కాదు. మీరిలా కంగారు పడతారనే బందోబస్తు లేకుండా నేనిలా ఒంటరిగా వచ్చాను. చిన్న విచారణ అంతే, మీకు నేనున్నాగా." అంటూ ఆ ముసలాయనకి దైర్యం చెప్పాడు రంజిత్.

"సార్ సూసుకుంటాను అంటున్నాడు గా ఏం కాదులే అయ్యా" అంటూ రంగయ్య కూడా ఆ దైర్యాన్ని కొంచెం పెంచాడు.

సరేనంటూ.. తలాడించాడా పెద్దాయన.

రంజిత్ : నీ పేరేంటి..?

కాటి కాపరి: నా పేరు "ఎంకట నారాయణ" బాబు గారు, దాని పేరు "కాంతం".

రంజిత్: మీరిద్దరేనా ఉండేది? లేక ఇంకెవరైనా...?

కాటికాపరి: మాకే దిక్కుమొక్కు లేదయ్యా.. నేనూ, అదే !

రంజిత్: ఇక్కడ సత్య నారాయణ అని ఎవరైనా కాటి కాపరి ఉన్నాడా...

కాటికాపరి: దాదాపు నేనుట్టి డబ్బే ఏళ్లు అవుతుందయ్య, అప్పటినుండి ఇక్కడే ఉంటున్నా, ఇక్కడ అట్టాంటోల్లు ఎవరూ లేరయ్య? ఈ కాటికి నేనే కాపరిని.

"సత్య నారాయణ" మా అయ్య పేరు, ఆడు పోయి కూడా చాన్నల్లైంది.

రంజిత్: అవునా..!(ఆశ్చర్యపోతూ), ఆయన ఫోటో లాంటిది ఏమైనా ఉందా!( రాత్రి తన కల్లోకొచ్చిన రూపాన్ని తలచుకుంటూ)

కాటికాపరి: అట్టాంటివి నాకాడ ఏటీ లేవయ్యా?

రంజిత్: "పోనీలే.. సహకరించినందుకు థాంక్స్ పెద్దాయన, ఇదిగో ఈ ఐదు వేలు తీసుకో, నీక్కొంచెం ఆసరాగా ఉంటుంది." అంటూ ఆ డబ్బు అతనికిచ్చి ..

రంగయ్య రంజిత్, ఇద్దరూ అక్కడ నుండి వచ్చేశారు.

                   *******************

ఆ రోజు స్టేషన్ లో కూడా తన బుర్రలో నుండి ఈ ఆలోచనలు పోవడం లేదు రంజిత్ కి. "అసలెప్పుడో చచ్చిపోయిన సత్య నారాయణ, తన కలలో ఈ కేసు కు సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి?

సత్య కృష్ణ, సత్య కాంత్, సత్య కిరణ్, సత్య కుమార్ ఎవరు వీళ్లంతా? ఇదంతా నా ఊహెనా?"

ఇలా రకరకాల ఆలోచనలతో ఏసిపి రంజిత్ కి పిచ్చెక్కుతుంది.

తన టీమ్ కి చెప్పి సిటీ, మరియు దాని చుట్టు పక్కలున్న అన్ని అనాధశ్రమాలకు వెళ్లి సత్య కుమార్, సత్య కాంత్, సత్య కృష్ణ, సత్య కిరణ్ ఈ పేర్లతో ఎవరైనా వున్నారేమోనని, వాళ్ల వివరాలు సంపాదించమని ఆదేశిస్తాడు ఏసిపి రంజిత్. వాళ్ళతో పాటు రంజిత్ కూడా వాల్ల కోసం సెర్చ్ చేస్తాడు.

రెండ్రోజులుగా ఎంత వెతికినా... వాళ్ళ ఆచూకీ కానీ, ఆధారాలు కానీ లభించకపోవడంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది.

"అసలు వీళ్లంతా ఎవరూ సార్ !"

ఈ కేసుకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా?

ఎవరైనా మీకు ఈ వివరాలు అందించారా?"

అని ఆ టీమ్ లో అభిరామ్ అనే ఒక పోలీసధికారి తదేకంగా ఆలోచిస్తున్న ఏసిపి రంజిత్ ని అడుగుతాడు.

దాంతో ఆ రోజు రాత్రి తనకొచ్చిన కల గురించి వివరిస్తూ, కేసులో పురోగతి లేక, ముందుకు వెళ్ళకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతాడు.

"మరి మీ గెస్ట్ హౌజ్ పక్కనే కదా.. స్మశాన వాటిక!,

అక్కడికి వెళ్లి ఏమైనా ఎంక్వైరీ చేద్దామా సార్?"

అని రమ్య అనే ఇంకో ఆఫీసర్ రంజిత్ కి సలహా ఇస్తుంది.

"హా..! అది కూడా అయ్యిందమ్మా!.

అక్కడుంటున్న ఆ కాటి కాపరిని కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్ల దగ్గర కూడా ఆధారాలేమి లభించలేదు. కానీ, నా కలలో కనిపించిన సత్య నారాయణ అనే పేరు గల వ్యక్తి వాళ్ల ఫాదర్ అట, ఆయన ఎక్స్పైరయ్యి చాలా ఇయర్స్ అయ్యింది అట.

బట్, ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావడం లేదు."

"కూల్ డౌన్ సార్..!

మే.. బి.., మీరు అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళడం, ఈ కేసు కి సంబంధించి దొరికిన ఏకైక క్లూ "సత్య" అనే పేరు దొరకడం .. వాటి గురించి మీరు పదె పదె ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ తలంపులో నిరంతరంగా మెదిలి, మీ కలలోకి ఇవన్నీ వచ్చుంటాయి సార్!" అన్నాడొక ఆఫీసర్ రాకేష్.

"లేదు రాకేష్!

కలలు కూడా మనకి పరిచయం ఉన్న వ్యక్తుల మీదే వస్తాయి. కానీ, వీల్లేవరూ ఇప్పటివరకూ నాకసలు పరిచయమే లేదు. మరెందుకు ఇదంతా జరుగుతుంది?. ఎక్కడో ఏదో తేడా అనిపిస్తుంది." అంటూ వివరణిస్తాడు రంజిత్.

ఇంతలో సాకేత్ అనే రంజిత్ టీమ్ లో ఒక సభ్యుని నుండి రంజిత్ కి కాల్ వస్తుంది.

"సార్..! నాకిక్కడ ఒక అనాధశ్రమంలో, మీరు చెప్పిన పేర్లతో సరితూగే వ్యక్తుల డీటైల్స్ దొరికాయి.!" అంటూ ఆ ఫోన్ కాల్ సారాంశం.

దీంతో హుటాహుటిన రంజిత్ టీమ్ అంతా అక్కడికి చేరుకుంటారు.

                      *******************

ఆ అనాధశ్రమాన్ని చూసుకునే పెద్దాయన పేరు నారాయణయ్య .

రంజిత్ వెళ్లి ఆయనని అడిగి వాళ్ల డీటైల్స్ సంపాదించే పనిలో పడతారు.

"హెలో సార్..!

నా పేరు రంజిత్

ఓ కేసు పని మీద, ఇక్కడికి ఓ చిన్న ఎంక్వైరీ చేద్దామని వచ్చాను.

మా వాడు మీకు అంతా చెప్పేవుంటాడు.(సాకేత్ వంక చూస్తూ)"

"హా చెప్పాడు..." బదులిచ్చాడు రంజిత్.

చెప్పండి సార్..!

మీకు వాళ్ల గురించి

ఏం తెలుసో?,

ఎలా తెలుసో...?

"హమ్..

సత్య కాంత్, సత్య కుమార్, సత్య కృష్ణ , సత్య కుమార్...

వాళ్ళు నలుగురు మంచి స్నేహితులు. వాళ్ళతో నాకున్న అనుబంధం ఒక సంవత్సరం మాత్రమే అయినా, వాళ్ళతో బాగా చనువున్న వాడినే. సరిగ్గా నెనిక్కడికి వచ్చిన ఒక సంవత్సరానికి వాళ్ళు చదువు పూర్తయ్యి, మంచి మంచి జాబ్ లో సెటిల్ అవ్వడంతో ఇక్కడి నుండి వెళ్లి పోయారు.

చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగారని, ఎప్పుడూ ఏ చిన్న గొడవా పెట్టుకునేవారు కాదని, ఇదంతా నాకు ఇంతకుముందున్న వాళ్ళు చెప్పారు.

కానీ, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవారు. ఈ మధ్య రావడం మానేశారు. సుమారు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా వాల్లొచ్చి!.

అంతే,

ఇంతకుమించి నాకేం తెలీదు." అని తనకు తెలిసింది చెప్పాడు ఆ ఆశ్రమం లో ఉండే నారాయణయ్య.

ఇతను చెప్పిందంతా, సరిగ్గా అచ్చుగుద్ధినట్టు అదే రంజిత్ కలలో కూడా జరగడంతో రంజిత్ తో సహా అక్కడున్న ఆ టీమంతా షాక్ అయ్యారు 

అప్పుడే టీం లో ఒకరైన రమ్యకు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి కాల్ వచ్చింది.

"ఆ హత్య వెనుక ఎవరో లేడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు మేము గుర్తించాము. ఎందుకంటే, ఆ ముగ్గురిని రక్కిన గోళ్ళు ఆడవారి చేతివేళ్ల గోళ్లని, అది కూడా ఒక్కరవేనని మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో తేలింది."

ఇదే విషయం రమ్య రంజిత్ తో పాటు, అక్కడున్న టీమ్ లో వాళ్లందరినీ పక్కకి పిలిచి చెప్పింది.

కేసు ఇన్ని మలుపులు తిరగడం, పైగా ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో, వాళ్లంతా ఉక్కిరిబిక్కిరయ్యి తిరుగు ప్రయాణం చేపట్టడానికి సిద్ధపడ్డారు.

"థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కోపరేషన్ సార్..!" అంటూ నారాయణయ్య కి థాంక్స్ చెప్పి రంజిత్ అండ్ టీమ్ బయలుదేరబోతుంటే!,

టీంలో ఒకరైన సాకేత్..

"వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే వారన్నారు కదా...!

మరి వాళ్ల కాంటాక్ట్ డీటైల్స్ ఏమీ మీ దగ్గర లేవా?" అని అడగగానే అది విన్న మిగతావాల్లకి ప్రాణం లేచోచ్చినట్టయింది.

"ఒకప్పుడు ఉండేవి, కానీ వాళ్ళు రావడం మానేసాక, చాలా సార్లు వాళ్ళకి కాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. స్విచెడ్ ఆఫ్ అని వచ్చేవి. ఏమయ్యారో తెలీదు. వాటి వల్ల యూజ్ లేదని తీసేసా." బదులిచ్చాడు నారాయణయ్య.

పెట్టుకున్న ఆ చిన్న ఆశ కూడా అడియాశ కావడంతో నిరాశగా రంజిత్ అక్కడి నుండి వెనకకి తిరిగి బయటకి వచ్చేయబోతుంటే,

"ఒక్క నిమిషం ..!" అంటూ వాళ్ళని ఆపి,

తన ఫోన్లో ఒక కాంటాక్ట్ నంబర్, అక్కడున్న సాకేత్ కి ఇస్తూ...

"ఇది శ్రుతి అనే అమ్మాయిది.

ఆ అమ్మాయి కూడా ఇక్కడే, వాళ్ళతో పాటు పెరిగింది. సత్య కుమార్, తనూ.. ఇద్దరూ ఒకే కంపనీ లో చేస్తున్నట్టు ఒకసారి చెప్పింది. వాళ్ళతో పాటు ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేది. వాళ్ళు రావడం మానేశాక తను ఇక్కడికి ఒకట్రెండు సార్లు వచ్చినా, వాళ్ల గురించి అడిగితే తెలీదని చెప్పింది.

ఆ తర్వాత తను కూడా కొన్నాళ్ళకి ఇక్కడకి రావడం పూర్తిగా మానేసింది. రీసెంట్ గా ఒకసారి వస్తె, ఇన్నాళ్లు ఏమైపోయారు?, మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడ? అని అడిగితే నాకసలు సమాధానం కూడా చెప్పలేదు. తన అవసరం ఎప్పుడైనా ఉండొచ్చని భావించి, ఈ ఆశ్రమంలోనే ఒక పాప ద్వారా తన కాంటాక్ట్ నంబర్ తీసుకున్నాను.

మీకేమైనా ఉపయోగపడవచ్చేమోనని మీకిస్తున్నాను?" అని వాళ్ళతో అన్నాడు నారాయణయ్య...

చివరికి ఆ కేసు కి సంబంధించి ఇంకో క్లూ దొరకడంతో ఊపిరిపీల్చుకున్న వాళ్ళు, అక్కడి నుండి బయలుదేరి శృతిని వెతికే పనిలో పడ్డారు.

                           ******************

రంజిత్ కొచ్చింది కలైతే, మరి జరుగుతున్న ఈ పరిణామాలన్నీ నిజాలు కావా?

✓తనకొచ్చిన కలలన్నీ ఒక్కోటిగా నిజాలవుతున్నాయి కాబట్టి, ఇవన్నీ నిజాలేనా..?

✓ చనిపోయిన ఆ సత్యనారాయణ దెయ్యం రూపంలో వచ్చి, ఆ డైరీ ఇచ్చాడా?

✓ అతనిచ్చిన డైరీ అసలుందా, ఉంటే వాటిలోవన్నీ నిజాలేనా? మరి ఆ డైరీ కనిపించకుండా ఎలా పోయింది!

✓డైరీలో ఉన్నట్టు స్నేహితులంతా చనిపోయినా, సత్య కుమార్ ఇంకా బ్రతికే వున్నాడా? ఉంటే, అతనెక్కడున్నాడు? వాళ్ల జీవితాలలో జరిగిందంతా నిజమేనా?

✓ ఆ హత్య కేసులలో ఒక లేడీ పాత్ర కూడా ఉండడమనే ట్విస్ట్ ఏంటి? అసలా లేడీ ఎవరూ?

✓అసలు శృతికి ఈ కేసుకు సంబంధమేమిటి?

✓ అంత మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ల నలుగురి గురించి నారాయణయ్య అడుగుతుంటే శ్రుతి ఎందుకు పెదవి దాటవేసింది.?

✓ శ్రుతి ఎక్కడుంది, తన వద్ద ఈ కేసులకు సంబంధించి ఇంకేం వివరాలు దొరకబోతున్నాయి.

కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న నా ఈ అన్వేషణ అనే కథ ఇంకా పూర్తికాలేదు. ఆ మా"నవ" మృగం కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతూనే ఉంది.

మిగిలిన కథ

అన్వేషణ-7(ఓ మా"నవ" మృగానికై) లో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నా రచనలను ఓపికగా చదువుతున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror