naveen surya

Thriller

4.5  

naveen surya

Thriller

బాటసారి - 1

బాటసారి - 1

3 mins
629


నా పేరు ..... గుర్తులేదు ,కుత వేటు దూరంలో ఒక బోర్డ్ చిరుతలు ఉన్నాయి జాగ్రత్త , చిరుతలా అమ్మో అనుకుంటూ చుట్టూ చూసాను దూరంగా ఒక చిన్న చెట్టు దాని పక్కన ఆగి ఉన్న ఒక జీపు 

ఇంతకీ అది నాదేనా . నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఎలా వచ్చి ఉండొచ్చు ఏమి అర్ధం కావడం లేదు , నా పేరు ఎంటి నేను ఎక్కడ నుండి వచ్చానో తెలిస్తే , ఇక్కడకి ఎందుకు వచ్చానో , నేను ఎక్కడకి వెళ్ళాలో తెలుస్తుంది . కానీ ఎలా తెలుసుకోవడం 


లేవడానికి చాలా బద్దకం గా ఉంది . నేను తాగేసి ఇక్కడ కి వచ్చి పడుకున్ననా , లేదంటే నా బండి ఇక్కడకి వచ్చి ఆగిపోయిందా , నన్ను ఎవరైనా కొట్టి పడేసారా ? అయినా జన సంచారం లేని ఇక్కడకి నేను ఎందుకు వస్తాను 


వెతికితే ఏదైనా దొరకవచ్చు అని దుస్తులను పరికించి చూసాను నల్ల గీతలు ఉన్న ఎరుపు చొక్కా మరియు నీలం ప్యాంట్ వేసుకున్న

బట్టలంతా మట్టి మరియు అక్కడక్కడ చిరుగులు ? ఎలా చిరిగింది ఎవరు చించి ఉండొచ్చు ? ఘర్షణ లాంటిది ఏమైనా జరిగిందా ? 


 జేబుల్లో ఏమి లేదు దూరంగా ఒక పర్సు లాంటి వస్తువు ఉంది కానీ అందులో ఏమి లేదు . ఏదో ఒకటి ఉండాలి కదా ఏమి లేకపోవడం ఎంటి ? బట్టల్లోనే తెలుస్తుంది నేను ఒక మినీ శ్రీమంతుడు నీ అని 

బహుశా నేను పడుకున్నాక నా వస్తువులను దొంగతనం చేసి ఉండొచ్చు అని అనుకున్నాను


చెట్టు దగ్గరకి వెళ్లి జీపు ను చూసాను . చూస్తే ఇది చాలా కాలంగా అగి ఉన్నదిగా కనిపిస్తుంది . అంటే నేను ఇక్కడకి వచ్చి చాలా రోజులు అవుతుందా ? ఇంతకీ ఈ జీప్ నాదేనా ఆ జిపు కి తాళం కూడా ఉంది ? అంతా అయోమయం గా ఉంది ఆకలి గా ఉంది 

ఏదైనా దొరుకతుందేమో అని చూసాను 


జీప్ స్టార్ట్ చేసి , జీప్ కి ఎడమ వైపు ఉన్న దారి లో వెళ్ళసాగాను

2 కిలో మీటర్లు వెళ్ళాక ఒక చిన్న ఊరు వచ్చింది అర్థం కాని భాష లో దాని పేరుంది అలాగే ఇంకా ముందుకి వెళితే చెట్లు ఆ చెట్లకి జామ కాయలు ఉన్నాయి వాటిని కోసుకుని తిన్నాక పక్కన ఉన్న ఒక తొట్టి లోకి నీళ్ళు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని, ముఖం కడుక్కుని పక్కనే ఉన్న ఒక కుర్చీ మీద కూర్చున్నాను 

చుట్టూ చూసాను ఒక పది , పదిహేను పళ్ళ చెట్లు పక్కన గంపల్లో జామ , అరటి , బత్తాయి లాంటి పండ్ల చెట్లు ఉన్నాయి ఇంకాస్త దూరంగా ఒక చిన్న గుడిసె మరియు ఆ గుడిసె ముందు కళ్ళు మూసుకుపోతున్నాయి ....... ఒక ఆకారం అది పురుషుడు ది బహుశా దీని ఓనర్ అనుకుంటా , నా వైపే వస్తున్నాడు , నా కళ్ళు పూర్తిగా మూసుకుపోతున్నాయి నా మొహం లో మొహం పెట్టి అరవింద్ , అరవింద్ అంటూ పిలవసాగాడు 


పూర్తిగా పడుకున్నాను కానీ నాకు అర్థం అవుతుంది అంటే నా పేరు అరవిందా నేను ఇతనికి తెలుసా , ఒక అడవి లో , అందులోనూ జన సంచారం లేని ఒక ప్రదేశం లో దారి తప్పిన నన్ను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎవరు ఇతను ? 


నన్ను లేపడానికి ప్రయత్నించాడు నేను లేవలేని స్థితిలో ఉన్నాను.

ఎవరైనా ఉన్నారా గట్టిగా ఒక అరుపు ... నన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ లేపలేక పోతున్నాడు ఈ సారి మరింత బలం తో ప్రయత్నించాడు కనీసం కదపలేక పోతున్నాడు 

అతని వెనక నుండి ఒక స్వరం బాబు తప్పుకో . బలిష్టంగా కండలు తిరిగిన శరీరం అది వచ్చిన వ్యక్తి ఒక్కసారికే తీసుకెళ్ళి గుడిసె లో పడుకోబెట్టాడు


రాత్రి అయింది అస్సలే క్రూర మృగాలు తిరిగే ప్రాంతం , మీరు రేపు తెల్లవారగానే బయలుదేరండి అని చెప్పి వెళ్ళిపోతాడు 

వెళ్ళి పోయిన వ్యక్తి ఒక స్థానికుడు. నా పక్కన కూర్చుంది నా స్నేహితుడు అయ్యుండొచ్చు మరి లేకపోతే నన్నెందుకు కాపాడాలి అనుకుంటాడు మరి అలాంటప్పుడు జీప్ నీ మరియు నన్ను ఎందుకు వదిలేసి వచ్చినట్లు 


అర్జున్ బాబు భోజనం చేద్దాం రండి ! మళ్ళీ స్వరం

రాజన్న గారు అరవింద్ ఇంకా లేవలేదు కాసేపయ్యాక తింటాను అని సమాధానం ఓహో వీళ్ళ పేర్లు అర్జున్ , రాజన్న లు అన్నమాట కానీ ఇలాంటి అడవి లో అందులోనూ రాజన్న ఒంటరి గా ఉండటం ఎంటి అన్నది అస్సలు అర్థం కాలేదు అర్జున్ తినడానికి వెళ్ళాడు కానీ భోజనం చేస్తూ కూడా నన్నే గమనిస్తున్నాడు , రాజన్న కూడా నన్ను గమనిస్తున్నాడు కానీ తేడా ఉంది రాజన్న ముఖ కవలిక లలో ఏదో తేడా కొడుతుంది కాసింత భయం , ఆందోళన చల్లని గాలి లో వేడిగా చెమటలు పడుతున్నాయి భోజనం పూర్తి చేసుకుని చేతులు కడుక్కుని సిగరెట్ కలుద్దాం అని అలా బయటకు వెళ్లారు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో వినిపించడం లేదు 


ఏమి జరుగుతుందో అర్థం కాని అయోమయం కానీ ఆ అయోమయం లో నాకు ఏదో గుర్తుకు వస్తుంది నేను జిప్ లో ఎక్కడ నుండో అడవి లోకి వస్తున్నాను పక్కన ఎవరొ ఉన్నారు అర్జున్ ??? కాదు అది ఒక అమ్మాయి రూపం . ఇంతకీ నేను ఎక్కడ నుండి వస్తున్నాను ? ఎక్కడ కి వెళ్తున్నాను .ఇంతకీ అర్జున్ , రాజన్న లు ఎవరు , 

నాతో పాటు జీప్ లో ఉన్న అమ్మాయి ఎవరు , తన పేరేంటి 

అస్సలు అడవి లో ఎందుకు ఆగాల్సి వచ్చింది . ఆగాల్సి వచ్చిందా !? లేదంటే ఎవరైనా అపారా !?


జీప్ లో వచ్చినప్పుడు బోర్డ్ చూస్తే అర్థం కాని భాష లో ఉంది , కానీ ఇక్కడ రాజన్న ఏమో తెలుగు లో మాట్లాడుతున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా లోపలికి అర్జున్ మరియు రాజన్న వచ్చారు 

ఏమి చేయాలో రేపు పొద్దున ఆలోచిద్దాం .ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మనం సురక్షితంగా నే ఉన్నాం అని అర్జున్ తో రాజన్న అంటాడు . కానీ ఎప్పుడైనా మనకి సమస్య రావొచ్చు మనం జాగ్రత్త గా ఉండటం అవసరం అంటాడు అర్జున్ 

ఇక ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.....


సశేషం.... 









Rate this content
Log in

Similar telugu story from Thriller