Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కొన్ని ఉద్యోగాలు - ఎండమావులు

కొన్ని ఉద్యోగాలు - ఎండమావులు

1 min
1.8K


రేయ్. పొద్దుగాల పండినవ్. బుక్కు పట్టుకోని సదవరాదురా. పక్కింట్లో ఆంటీ కొడుక్కి అక్షింతలు వేస్తోంది. 


రెండేళ్ల క్రితం వరకూ మా ఇంట్లోనూ ఇలాంటి అక్షింతలు తరచుగా వినిపించేవి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక ఇంట్లో మనమంటే ఒక స్పెషల్ రెస్పెక్ట్. 


నెల నెలా ఇంత జీతం పట్టుకుని ఇంటికి వస్తే ఆ మజాయే వేరు. 

కానీ ఒక్కటే వెలితి. నేనేం చేస్తున్నానో నాకు తెలీదు. రోజూ సాయంత్రానికి రిపోర్ట్ పెట్టేస్తాను. ఒక్కోసారి ఎందుకు చెయ్యాలి జాబ్ అనిపిస్తుంది.


గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ అంత మోజు ఎందుకో. అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఒకేలా ఉండవు. గవర్నమెంట్ జాబులో పని చేయాల్సిన అవసరం ఉండదు అని అందరినీ ఒకటే గాటన కట్టేస్తారు. అందరూ పని చేయకుండా ఉంటే దేశం ఎలా నడుస్తోంది.. ఈ ఒక్క విషయం ఎవ్వరికీ అర్థం కాదెందుకో.


ఏరోజు వచ్చిన కంప్లయింట్ లెటర్ కి నేను ఆరోజే రిప్లై ఇచ్చేస్తాను. కానీ ఆ ఫైల్ నుండి లెటర్ డిస్పాచ్ కి వెళ్ళేసరికి కొన్ని రోజులు పడుతుంది. అది కంప్లయింట్ ఇచ్చిన వాళ్ళకి చేరే సరికి నెల పట్టొచ్చు. 


ఒక్కోసారి మనం ఎంత బాగా వర్క్ చెయ్యాలి అనుకున్నా ఆఖరుకు కొన్ని పాలసీలు, రాజకీయ పరిస్థితులు అడ్డొస్తాయి. అనుకున్న వారికి సాయం అందదు.


ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదీ చెప్పాలనిపించట్లేదు. వాళ్ళడిగినా సరే మౌనంగా ఉంటున్నా. వ్యవస్థ మారాలి. అందుకు నాలో మార్పుకు నేను సిద్ధం.

కానీ కొన్ని సార్లు ఈ వ్యవస్థలు, ఆఫీసులు ఎండమావుల్ని తలపిస్తాయి.


ఈ ఎండమావుల లాంటి చోట ఒక్కడే ఎంత దూరం నిజాయితీగా ప్రయాణించగలడు.. చూద్దాం.కాసిన్ని నీళ్ళు ఉన్నాయి. అడుగులు భారంగా పడుతున్నాయి.



Rate this content
Log in

Similar telugu story from Abstract