Dinakar Reddy

Abstract Children Stories Drama

3  

Dinakar Reddy

Abstract Children Stories Drama

కవల సోదరులు

కవల సోదరులు

1 min
144


ఒరేయ్ చింటూ, ఇంకా బంటీ రాలేదెంటి అని అడిగారు క్లాస్ టీచర్. సార్! నేనే బంటీని. చింటూ ఈరోజు జ్వరమని స్కూలుకు రాలేదు సార్ అని అతని కవల సోదరుడు బంటీ చెప్పాడు.


ప్రతి సారీ వీళ్ళిద్దరినీ సరిపోల్చుకోలేక తికమకపడుతున్నా అనుకుని క్లాస్ టీచర్ ఒక ఆలోచన చేసాడు. ఇద్దరిలో ఒకరైన చింటూను పచ్చబొట్టు పొడిపించుకోమని మరుసటి రోజు చెప్పాడు.


వారం రోజుల తర్వాత క్లాస్ జరిగేటప్పుడు ఇద్దరిలో ఎవరికి పచ్చబొట్టు లేదో అతనే బంటీ అనుకుని అదే పేరుతో పిలిచాడు. అతను లేచి నిలబడి, సార్! మీరు పొరపాటు పడుతున్నారు. నేను చింటూని. నేను ఒక్కడినే పచ్చబొట్టు పొడిపించుకుంటే బాగోదు అని మా అమ్మగారు బంటీని కూడా పచ్చబొట్టు పొడిపించుకోమన్నారు అంటూ పక్కనే ఉన్న తన కవల సోదరుని వైపు చూసాడు.


అవును సార్ అని చెప్పాడు బంటీ. కాకపోతే ఇద్దరం వేరే వేరే చేతులకు పచ్చబొట్టు పొడిపించుకున్నాం. అందుకే మీరు పొరపడ్డారు అంటూ ఇద్దరూ చేతులు ముందుకు చాచి చూపించారు.


ఈసారి క్లాస్ టీచర్ మరో గొప్ప ఆలోచన చేస్తున్నాడు...కవల సోదరులను గుర్తు పట్టడానికి..


Rate this content
Log in

Similar telugu story from Abstract