Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మెరిసే తారకలు

మెరిసే తారకలు

1 min
275



కదిలిపోయే నీరు కాదు కొన్ని జ్ఞాపకాలు

అలా మెరిసి మనసు మురిపించే తారకలు

బుద్ధిగా తయారు అయ్యి

బడికి వెళ్తుంటే , వెనక్కు పిలిచి

అమ్మ నుదిటి మీద ముద్దు పెడితే

అదే రోజు ఆమె పరలోకాలకు వెళ్ళిపోయినా

ఆ ముద్దు మాత్రం ముద్రగా నిలిచిపోతుంది కదూ

కనిపించక పోయినా నుదుటి మీద!


నిండుగా దట్టంగా మబ్బులు కమ్ముకున్న నిశి రేయి

చటుక్కున చందమామ కనిపిస్తే

ఆ దృశ్యం అలా నిలిచిపోదూ ఎప్పటికీ !


అనుకోకుండా బజారులో అప్పటి 

' మమత ' కనిపించి 

ఆ రోజుల్లో నువ్వంటే నాకూ ఇష్టం ఉండేది..ప్చ్ 

అని అంటే,

మరి మరిచి పోగలమా ఆ ఘడియను !


చాలా పేరున్న పేద్ద రచయిత ఒకరు తారసపడి

" బాగా రాస్తావోయ్ నువ్వు " అని భుజం తట్టిన రోజు

తలుచుకోని రోజంటూ ఉంటుందా ఇక !


పరుగు పందెం అయిన జీవిత సరళిలో

పడక్కుర్చీలో కూర్చుని తీరిగ్గా కాఫీ ఆస్వాదిస్తూ

ఏదో గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటే

పక్కనే ఉన్న బెటర్ హాఫ్ ' ఏమిటీ ' అని అడిగితే 

నిజం అయినా కాకపోయినా 

" మనం ఒక్కటైన మొదటి రోజు గుర్తుకు వచ్చి ' అంటే

ఇక కొద్ది రోజులు రోజూ పండగేగా !

..... ,


మబ్బులు వస్తూ ఉంటాయి , పోతూ ఉంటాయి

మధుర స్మృతుల మెరిసే తారకలను మాత్రం 

పదిలంగా నిక్షిప్తం చేసుకో మిత్రమా ,

పోతూ పోతూ నవ్వుతూ పోవచ్చు !


Rate this content
Log in

Similar telugu story from Inspirational