Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రంగు- ప్రేమ - జీవితం(కలర్ ఫోటో)

రంగు- ప్రేమ - జీవితం(కలర్ ఫోటో)

1 min
631


అదేంటో కన్నయ్యా! మనుష్యులు రంగు చూసే ప్రేమించాలి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇదెప్పుడూ మారదంటావా? అంది దీప్తి. జయకృష్ణ మెల్లిగా నవ్వాడు.


ఎందుకు కన్నయ్యా నవ్వుతున్నావ్ అంది దీప్తి అతని ఒళ్ళో తల పెట్టుకుని. 


ఏం లేదండీ. ఇంకో ఐదు నిమిషాల్లో ఈ లోకంలో మనం ప్రాణాలతో ఉండం కదా. ఇంకా మనుష్యుల మార్పు గురించి ఆలోచించడం ఎందుకు.


కాకినీ, రామచిలుకనూ పక్క పక్కనే చూస్తే కాకి నల్లగా ఉందని బాగోలేదు అంటారు. అక్కడ నలుపు రంగు బాగోలేదు అని మనకు ఎవరు నేర్పారు? ఆకుపచ్చని రామచిలుకను ఇష్టపడమని ఎవరన్నారు?


ఇవన్నీ ఎక్కడా స్కూల్లో , కాలేజీలో టెక్స్ట్ బుక్స్ లో పెట్టి నేర్పించరు కదా. ఈ అభిప్రాయాలు మనం మార్చుకోనంత వరకూ రంగు కోసం పెళ్లి సంబంధాలు వద్దనడం మారదు. ప్రేమను అడ్డుకోవడం ఆగదేమో అంటూ ఆమె వైపు చూశాడు.


దీప్తి అప్పటికే ఆఖరి శ్వాస తీసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు జయకృష్ణ ను హాస్పిటల్లో చేరుస్తాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract