SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహా భారతం - 42"

"శ్రీ కృష్ణ మహా భారతం - 42"

5 mins
311


"శ్రీ కృష్ణ మహా భారతం - 41" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 42"

కౌరవులు పాండవుల ప్రయాణ మార్గంలో అర్జునుడు ఒకడే ఒకచోట కూర్చుని, కృష్ణుడు ఇచ్చిన ఆ బహుమతిని అందులో ఉన్న ఆ ఐదు నాణేపు పరిమాణంలో ఉన్న వస్తువుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలో అక్కడికి ద్రోణాచార్యుడు వచ్చి,

"యుద్దానికి సిద్దమేనా వత్సా..!" అని అడిగితే,

అర్జునుడు "తప్పకుండా...

నేను ఎల్లప్పుడూ సిద్ధమే గురుదేవా ..!" అని బదులు ఇస్తాడు.

"నీ జీవితలో మొదటి యుద్ధం ఇది,

నీకు భయం వేయడం లేదా..!" అని ద్రోణుడు అడగ్గా...

"నా మీద మీకు నమ్మకం లేదా గురుదేవా ..!" అని అర్జునుడు అడుగుతాడు.

దానికి ద్రోణుడు

"నమ్మకం నీ మీద కాకపోతే, ఇంకెవరి మీద ఉంటుంది అర్జునా..!" అని బదులు ఇస్తూ...

"ఇవేమిటి..?" అని అర్జునుడు చేతిలో ఉన్న వాటి గురించి అడుగుతాడు

దానికి అర్జునుడు...

"ఇదొక చిక్కు ప్రశ్న గురుదేవా..!

నాకు అర్థం కావడం లేదు. దీన్ని విప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను" అని బదులు ఇస్తాడు.

పాంచాల దేశంలో...

శిఖండి యుద్దానికి సిద్దమయ్యి, పాంచాల దేశ రాజు దృపదుడి ఆశీర్వాదం కోసం వస్తుంది.

"ఏ ఒక్క రాకుమారుడిని వదలకుండా, అందరినీ బంధించు, అప్పుడే భీష్ముడు వస్తాడు. నువ్వు అతన్ని వధించే అవకాశం లభిస్తుంది.

హరహర మహాదేవ..!

జయము..! జయము..!!" అంటూ శిఖండి నుదుట వీర తిలకం దిద్ది ఆమెను ఆశీర్వదించి యుద్దానికి పంపుతాడు.

ఇంకో పక్క ఇక్కడ పాండు కుమారులు ద్రోణుడు ఆశీర్వాదం తీసుకుంటారు.

అప్పుడు ద్రోణుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటాడు...

"యుధిష్ఠరా..!

నీ భుజ స్కందాల పై ఇప్పుడు అధిక భారమే ఉండబోతుంది.

ఒకవేళ ఈ యుద్ధంలో పరాజయం పాలైతే, అది సేనాపతిగా నువ్వే మొయ్యాలి. ఒక వేళ గెలిచినా ఆ ప్రతిఫలం నీకే లభిస్తుంది. కాబట్టి యుద్ద సమయంలో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేసే బాధ్యత, భారం నీ పై ఉండబోతుంది. కానీ, వాటికి ఏమాత్రం నువ్వు లొంగకుండా చాకచక్యంగా వ్యవహరించి యుద్ధంలో విజయం సాధించాలి" అని కొన్ని సూచనలు చేస్తుంటాడు.

దానికి యుధిష్ఠిరుడు

"యుద్ధంలో గెలిస్తే అది సర్వ సైనికులకు చెందుతుంది గురుదేవా..!

ఒకవేళ ఓడితే, ఆ ఓటమికి బాధ్యత వహించాల్సింది కేవలం సేనాధిపతిగా ఉన్న నేను మాత్రమే. అదే ఉత్తమం. ఉత్తమ సేనాధిపతిగా నా కర్తవ్యం." అంటూ తన నిస్వార్థ మనసుని చాటుకుంటాడు.

"నిన్ను ఎవరు సేనాధిపతిగా ఉండమన్నారు సోదరా యుధిష్ఠిరా..!" అంటూ అప్పుడే అక్కడికి వస్తాడు దుర్యోధనుడు అతని సోదరులతో కలిసి,

"ఏం మాట్లాడుతున్నావ్ సోదరా దుర్యోధన..!" అని యుధిష్ఠిరుడు అడగ్గా...

"ఇది కేవలం గురు దేవులు తన ప్రతీకారం తీర్చుకోవడానికి పెట్టిన యుద్ధం లా నాకు అనిపించడం లేదు. ఈ రాజ్యానికి నిన్ను రాజుని చేద్దాం అనే ఉద్దేశ్యం తో మీకు మాకు పెట్టిన పరీక్ష లా ఉంది. ఇందులో మీరు పక్షపాతం చూపించారు గురుదేవా..!" అంటూ ద్రోణుడిని కోపంగా అడగ్గా...

"వెళ్లి మీ పితృ దేవుడు దృతరాష్ట్ర మహారాజు ని ఈ ప్రశ అడుగు, ఒకవేళ నేను అంత పక్షపాతమే చూపిస్తే, ఒక మహారాజుగా ఆయన దీనికి ఎలా అంగీకరించారో..!" అని ద్రోణుడు కూడా దృతరాష్ట్రడి మాటలకు అంతే కోపంగా బదులు ఇస్తాడు.

"ఆ సంగతి మాకు తెలుసు గురుదేవా..!

అతని కొంతమంది తప్పు దోవ పట్టించారు..!" అని యుధిష్ఠిరుడు అంటూ...

"అయినా ఈ యుద్ధం మీ ప్రతీకారం కోసమే కదా..!

అది మేము తీర్చుకుంటాము. ఇందులో నాకంటే పెద్దవారు పాల్గొనడానికి నేను ఒప్పుకోను. మరియు ఈ సైన్యానికి సేనాధిపతిగా నేను మాత్రమే వ్యవహరించాలి." అంటూ షరతు పెడతాడు.

"అదెలా సాధ్యం...

దీనికి మేమెందుకు ఒప్పుకోవాలి.

గురుదక్షిణ సమర్పించే విషయంలో మాకు భాగం ఉంటుంది" అని అర్జునుడు అంటాడు.

"కాదని ఎవరన్నారు అర్జునా..!

ఈ యుద్ధంలో నాకంటే పెద్దవారైన యుధిష్ఠిరుడు, భీముడు మాత్రమే పాల్గొనకూడదు...

మిగిలిన మీ ముగ్గురు సోదరులు నాకు సహాయం చెయ్యొచ్చు.

నేను గుడ్డిగా నా నూరుగురు సోదరుల మీకు సహాయం అందించడానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను" అంటూ రాజ్యాధికార కాంక్షతో చాలా గర్వంగా ఒక నియంతలా వ్యవహరిస్తాడు దుర్యోధనుడు.

అక్కడున్న పాండవులతో పాటు ద్రోణుడికి కూడా చాలా కోపం వస్తుంది యుధిష్ఠిరుడికి.

భీముడు కోపంగా వచ్చి,

"దీనికి మేము ఒప్పుకోక పోతే..?" అని దుర్యోధనుడి దగ్గరకి వచ్చి, అతడు మొహంలో మొహం పెట్టీ అతన్ని కోపంగా చూస్తూ అడుగుతాడు.

దానికి దుర్యోధనుడు..

"ఒప్పుకోకపోతే, ముందు కురుకుమారులకు మరియు పాండు కుమారులకు యుద్ధం జరుగుతుంది. అందులో ఎలాగో మేము గెలుస్తాం కాబట్టి, ఇక మేము మాత్రమే ద్రుపదునీ సైన్యంతో యుద్ధంలో పాల్గొంటాము." అంటూ మిక్కిలి కండ కావడంతో మరింత దురుసుగా వ్యవహరిస్తాడు.

"కురు కుమారుల మధ్య యుద్ధం జరిగితే, అది హస్తిన పురపు గౌరవానికి భంగం వాటిల్లినట్టే, దాని వలన మిగిలిన పక్క రాజ్యాల వారికి మనకు మనమే చులకన చేసుకున్నట్టు ఉంటుంది. దుర్యోధన నువ్వు కోరుకున్నట్లు గానే నీకొక్క అవకాశం ఇస్తున్నాను. మీరే దృపదుడిపై దండెత్తండి. విజయోస్తు..!" అంటూ దానికి ఒప్పుకుంటాడు దుర్యోధనుడు.

యుధిష్ఠిరుడు నిర్ణయాన్ని తన సోదరులు అంతా తప్పు పడుతుంటే, సహదేవుడు మాత్రం సమర్ధిస్తాడు.

యుద్ద భేరి మ్రోగుతుంది.

ఇటువైపు కౌరకూమారులు నూరుగురు పాంచాల దేశంపై దండెత్త డానికి వస్తున్నారు.

అది చూసిన పాంచాల దేశ సైనాధికారి శిఖండి..

"సైనికులారా..!

శత్రువులు మనపై దండెత్త డానికి వస్తున్నారు. వెళ్లి వాళ్ళని నిలివరించండి" అంటూ తన సైన్యాన్ని ఆజ్ఞపిస్తుంది.

పక్కనే ఉన్న ద్రుపదుడు...

"గుర్తు పెట్టుకో శిఖండి..!

ఏ ఒక్క రాకుమారుడు మరణించకూడదు. నాకు వారంతా ప్రాణాలతో కావాలి. వాళ్ళని మనం ప్రాణాలతో బందిస్తెనే భీష్ముడు వస్తాడు." అంటూ షరతు పెడతాడు.

అదే విషయం శిఖండి తన సైన్యానికి ఆజ్ఞాపిస్తుంది.

ఒక పక్క దుర్యోధనుడు మరియు అతడి సోదరులు శత్రువులను చంపుకుంటూ ద్రుపదుడి రాజ్య భవనాన్ని సమీపిస్తుంటే, ద్రుపదుడి సైన్యం మాత్రం సైనాధికారి ఆజ్ఞతో వాళ్ల పై దాడి చేయకుండా కేవలం ఆ దాడిని నిలువరించడానికి ప్రయత్నిస్తారు.

అది చూసిన దుర్యోధన సోదరులకు ఏం అర్థం కాదు.

దుశ్శాసనుడు..

"ఏంటి సోదరా..!

మనం ఇంతలా దాడి చేస్తుంటే, వీళ్ళు కనీసం మనపై ప్రతి దాడి చేయడం లేదు. నాకు ఇదేం అర్థం కావడం " అని దుర్యోధనుడు తో అంటాడు.

దానికి దుర్యోధనుడు...

"మనకు కావల్సింది ద్రుపదుడు తల. అతడు ఇక్కడే ఎక్కడో సైన్యం మధ్యలో ఉండి ఉంటాడు. పదా ముందుకు..!" అంటూ తన సోదరులతో ఇంకా ముందుకు వెళతారు.

అలా ఒక పాంచాల సైన్యం ఏర్పరిచిన మొదటి వలయంలోకి వెళతారు.

ఇక శిఖండి,

"మహారాజా..!

శత్రువులు మొదటి వలయంలో ప్రవేశించారు.

ఆ ముఖ ద్వారాలు మూసివేసి, రెండో ద్వారపు తలుపులు తెరవమని సన్యానికి ఆదేశించాను." అని దృపదుడితో చెప్తుంది.

"అలాగే వారు, ఒక్కొక వలయాన్ని చేధిస్తూ వస్తుంటే, వచ్చిన వలయ ముఖ ద్వారాలను ఒక్కోక్కటిగా మూసి వేయండి. వారు సరిగ్గా మధ్య స్థానంలోకి వచ్చాక, అన్ని వలయ ముఖ ద్వారాలు మూసేసి, వాళ్ళని బందించండి" అని ఆజ్ఞాపిస్తాడు ద్రుపదుడు.

కురుకుమారులను ఒక్కొక్క వలయంలో కొంత మందిని చొప్పున బందిస్తూ ఉంటారు పాంచాల సైన్యం.

దాంతో దుశ్శాసనుడు...

"సోదరా...!

మనం ఎలాంటి యుద్ధం చేస్తున్నామో నాకు అర్ధం కావడం లేదు." అంటూ దుర్యోధనుడినీ అడుగుతాడు.

"సైన్యాన్ని చేదిస్తూ లోపలికి అయితే వచ్చాం కానీ, దీనిలో నుండి బయటకు వెళ్ళే మార్గం నాకు అర్థం కావడం లేదు దుశ్శాసన. పైగా మనం. వచ్చిన ముఖద్వారాలు అన్ని మూసేశారు." అంటూ తను ఇంకో వలయంలోకి ప్రవేశించగానే బయట వలయంలో దుశ్శాసనుడిని, లోపలికి వలయంలో దుర్యోధనుడికి కూడా ఒక బలమైన వలతో బందిస్తారు.

ఇదే పాంచాల దేశ రాజు ద్రుపదుడు పన్నిన చక్ర వ్యూహం.

అది ఈ క్రింది చిత్రంలో చూపినట్లుగా ఉంటుంది.

దయచేసి గమనించగలరు.



(అందుకే పెద్దలు అంటుంటారు...

ఏ విషయం పైనైనా పూర్తి పరిజ్ఞానం లేకుండా దాన్ని ఆచరించకూడదు అని.

ఆచరిస్తే, ఇలా దుర్యోధనుడిలా చిక్కుల్లో పడక తప్పదు.)

కానీ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆ వలలను తెంపుకుని సైన్యంతో యుద్ధం చేస్తారు.

దృపడి కోపంతో శిఖండి,

ఆ రాకుమారులు ఇంకా యుద్ధం చేస్తున్నారు. ఇలా అయితే స్వయంగా నేనే యుద్ధంలోకి దిగి వాళ్ళని బందించాల్సి వస్తుంది. అలా జరిగితే, అది నీ పరాభవమే" అని అంటాడు.

దానికి శిఖండి...

"అలా ఎప్పటికీ జరగనివ్వనని పిత్రుదేవా..!

అతడితో నేనే స్వయంగా యుద్ధం చేసి, అతడిని బందిస్తాను" అంటూ రణభూమిలోకి దిగుతుంది.

తాను ఒక స్త్రీ అయినప్పటికీ తన బలం, శక్తి సామర్ధ్యాలతో దుశ్శాసనుడితో వీరోచితంగా పోరాడి అతడిని ఓడిస్తుంది. కానీ, దుస్సాసునుడిని రక్షించడానికి అక్కడికి వచ్చిన దుర్యోధనుడి చేతిలో పరజితురాలు అవుతుంది. అతడు ఒక్క సారిగా తన గదతో ఆమెను కొట్టగా కింద పడిపోతుంది.

సరిగ్గా అప్పుడే అక్కడికి వస్తాడు ద్రుపదుడు.

అతడితో యుద్ధం చేసి, అతడిని కూడా పరాజితుడిని చేసిన దుర్యోధనుడు, అతడిని కింద పడేసి, అతడి ఛాతీ పై కాలుపెట్టి అతడితో ఇలా అంటాడు

"కేవలం ఒక రాకుమారిని నా మీదకి పంపుతావా పాంచాల దేశ రాజా..!

అంటే, మీ దేశం ఇక ఇప్పుడు రాకుమారిని లపై ఆధారపడి ఉందన్నమాట..

ఆ కారణంగానే నేను మిమ్మల్ని కూడా పరాజితుడిని చేయగలిగాను." అంటూ గర్వంతో విర్రవీగుతూ వెకిలిగా అతడిని చూసి నవ్వుతాడు.

దానికి ద్రుపదుడు...

"నువ్వు నిజంగానే ద్రుపదుని ఓడించానని అనుకుంటున్నావా..!

నేనే ద్రుపదుడు అని అనుకుంటున్నావా..?" అంటూ ద్రుపదుడు కూడా వెకిలిగా నవ్వుతాడు.

దానికి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉండగా...

అచ్చం దృపదుడితో రూపంలో పోలిన ఇంకొంతమంది దుర్యోధనుడి చుట్టూ చేరి(రావణుడు ఒక తల నరికితే పది తలలు ప్రత్యక్షమైనట్టు),

"ఎవరు అసలు ద్రుపదుడో కనుక్కో...!

ఎవరు అసలు ద్రుపదుడో కనుక్కో...!"

అంటూ వెకిలిగా నవ్వుతుంటే,

దుర్యోధనుడికి పిచ్చెక్కుతుంది.

ఇక ద్రుపదుడు తన బాహు బలం మరియు బుద్ధి బలంతో దుర్యోధనుని బంధిస్తాడు.

బంధించిన దుర్యోధనుడిని అతడి సోదరులను విడిపించడానికి పాండు కుమారులు వస్తారా..?

వాళ్ళు దృపదుడితో యుద్ధం చేసి నిలవగలరా..?

చక్ర వ్యూహానికి అర్జునుడు రచించిన ప్రణాళికలు ఉపయోగపడతాయా...?


లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 43"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu story from Abstract