Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Others

4  

Praveena Monangi

Others

అనూహ్య మార్పు

అనూహ్య మార్పు

1 min
1.4K


పిట్ట కొంచెం కూత ఘనం లా

సూక్ష్మమైన వైరస్ కరోనా, కొండంత మార్పుల్ని తీసుకొచ్చింది/

రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఒకసారి రుచి చూపింది/

కాళ్లు కుదురుగా నిలపలేని వాళ్ళని

ఇంటిలోనే కట్టిపడేసింది/

చెట్టుకో పుట్టకో ఉండే కుటుంబ సభ్యుల్ని ఒక గూటికి చేర్చింది /

శుచిశుభ్రతలను తప్పనిసరి చేసింది/

గృహమే స్వర్గసీమ అని రుజువు చేసింది/

మేము సైతం అంటూ మగవాళ్ళని, పిల్లల్ని

గరిట, చీపురు పట్టించింది/

గడప దాట కూడదనే

అదృశ్య లక్ష్మణ రేఖను లిఖించింది/

ప్రాచీన సాంప్రదాయాల ఔన్యత్యాన్ని తెలియ జేసింది/

మితిమీరిపోతున్న హంగు ఆర్భాటాలకు కళ్లెం వేసింది/

మనుషుల పట్ల శాపంగా

ప్రకృతి పాలిట వరంలా మారిన ఈ మహమ్మారి

ఇంకెన్ని వింతలు,అనూహ్య మార్పులు చూపించ నుందో/


Rate this content
Log in