Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Others

4  

Praveena Monangi

Others

ప్రకృతి తడబడింది

ప్రకృతి తడబడింది

1 min
1.6K


నిత్యం వాహనాల కాలుష్యం తో

ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరైన ప్రకృతి

ఒక్కసారిగా కాలుష్య రాహిత్యాన్ని చూసి తడబడింది/

శబ్దకాలుష్యంతో చెవిటి అయిన ప్రకృతి

పక్షుల కిలకిల రావాలతో తడబడింది/

నిత్యం రక్తసిక్తమయ్యే రహదారులు నేడు

నిర్మానుష్యంగా అగుపించేసరికి ప్రకృతి తడబడింది/

జనావాసాలలో స్వేచ్ఛగా విహరిస్తున్న

జంతువులను చూసి ప్రకృతి తడబడింది/

నిర్జీవమైన జీవనదులు

నేడు సజీవమై పరవళ్ళు తొక్కుతూ ఉంటే చూసి

ప్రకృతి తడబడింది/

ఇన్ని మార్పులను ఒక్కసారిగా చవిచూసిన ప్రకృతి

ఋతువులనే మరిచిపోయేలా తడబడింది/

నేటి అకాల వర్షాలే అందుకు సాక్ష్యం.


Rate this content
Log in