Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

కవన కాశ్మీరం - కవితా సౌరభం - 1

కవన కాశ్మీరం - కవితా సౌరభం - 1

1 min
288



సుందర రమణీయ కమనీయ ప్రదేశం - మనోహ్లాదకర వర్ణ కాశ్మీరం

భారత మాత సుమధుర ఆకర్షిత ముఖ వీక్షణ - దేశానికే మణిమయ మకుటాయమానం

ఒక కంట సూర్య తీక్షణం - మరో కంటశాంతియుత కరుణ సోమరక్షణం

వేర్పాటు అగ్ని ఆక్రమణం - సరిహద్దులో చల్లబరచడమే మన కర్తవ్యం ||


శారదా శక్తిపీఠ అభివృద్ధి పథం -పుణ్య క్షేత్రభక్త పరి రక్షణ మన ధేయం

గుల్మేర్గ్ హిమ శకలాల క్రీడానందం - ధాల్ కాసారాన పర్యాటక విహారం

పర్యావరణ చిత్రకళాకృతుల ఆవిష్కారం - వీక్షకులచిరస్మరణీయ వినోదం

పదేపదే ముష్కరుల అతిక్రమణ కలకలం - మన సైనికుల, జనుల రక్షణ బలం ||


ఎప్పుడూ దాయాది దేశం చేస్తుంది అల్లకల్లోలం - ఎందుకీ దురాక్రమణ సరిహద్దులో

వేర్పాటువాద , ఉగ్రవాద పోషణ చర్యలను నిలిపి దురాక్రమణలకు స్వస్తి పలికితే ఉండదా

ఈ సీమ కూడా సుఖ శాంతులతో కాశ్మీరీ , భారత జనుల జీవనశైలి కాశ్మీరంలో సర్వదా నిలవాలి కలకాలం .


********


Rate this content
Log in

Similar telugu poem from Drama