Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Crime Thriller action

4.4  

Varun Ravalakollu

Crime Thriller action

డిటెక్టివ్ -1

డిటెక్టివ్ -1

2 mins
1.4K


శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.

సమయం రాత్రి 7-30 .. సాయంత్రం 5.15 నిమిషాలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం రెండుగంటల ప్రయాణానంతరం రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్ లో లాండ్ అయింది. విదేశాలకు వెళ్ళేవాళ్ళు..స్వదేశానికి తిరిగివచ్చేవాళ్ళు... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు...ఉద్యోగాల కోసం..సినిమా షూటింగ్స్ కోసం...వ్యాపారం కోసం.. తమ వాళ్ళ కోసం... ఇలా ప్రయాణీకులను ఆకాశమార్గంలో తీసుకువెళ్లే, తీసుకువచ్చే ఎయిర్ పోర్టులోకి ...అప్పుడే ఒకవ్యక్తి వచ్చాడు.

ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చిన ఆ యువకుడు ఎలాంటి లగేజీ లేకుండా చేతులూపుకుంటూ అప్పుడప్పుడు చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుంటూ తనలో తనే పాటను హమ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. తనవైపే వస్తోన్న క్యాబ్ ను చూసి విజిలేసాడు.

అది గమనించిన ఒక్కజంట విస్తుపోయింది.చూడ్డానికి హీరోలా వున్నాడు.. ఈ జులాయి పనులేమిటా అన్నట్టు చూసింది ఆ జంట,

***

క్యాబ్ లో వెనుక సీట్ లో కూచోని రిలాక్స్ అవుతూ రెండు చేతులూ రెండువైపులా బార్లాచాపి "డైవర్ భయ్యా..మన క్యాబ్ లో భక్తిపాటలున్నాయా? అడిగాడు.

ఒక్కక్షణం క్యాబ్ డ్రైవర్ కు అర్థం కాలేదు...అర్థం అయ్యాక ఏం చెప్పాలో అర్థం కాలేదు... "సర్లే భాయ్ సాబ్..."డు యు యాక్సెప్ట్ డాలర్స్.."అడిగాడు ఆ యువకుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తూనే తల వెనక్కి తిప్పి ఆ యువకుడి వైపు చూసి.."లేదు సార్..డాలర్స్ మేమేం చేసుకుంటాం..."సాధ్యమైనంత పోలయిట్ గా చెప్పాడు...

"పోనీ ఫైవ్ హండ్రెడ్ ..భౌజండ్ నోట్స్..మన మోదీజీ బాన్ చేసాడే అవి...ఎనీ ఛాన్స్ "ఈసారి ఆ యువకుడే డ్రైవర్ సీట్ దగ్గర తలపెట్టి అడిగాడు. డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసి"జోక్ చేయకండి సర్..మీ దగ్గర డబ్బులున్నాయిగా...?లగేజీ కూడా లేదు" నసిగినట్టు అనుమానంగా అడిగాడు.

"ఓహ్...లగేజీ ..ప్లయిట్లో దొబ్బేస్తారని ట్రైన్ లో పార్సిల్ చేసి నేను ప్లయిట్ లో వచ్చా ...యు డోంట్ వర్రీ..నన్ను కోఠీ దగ్గర దింపేసేయ్..."అన్నాడు. డ్రైవర్ కు అనుమానాలు బడాబాబుల స్కామ్స్ లా పుట్టుకొస్తున్నాయి. "మీరు హైద్రాబాద్ కు ఏం పనిమీద వచ్చారు సర్?అడిగాడు డ్రైవర్ "పానీపూరి తిందామని'?తాపీగా చెప్పాడు ఆ యువకుడు.

సడెన్ బ్రేక్ తో కారాపాడు డ్రైవర్. "పానీపూరి కోసమా? "ఏ ..పానీపూరి కోసం హైద్రాబాద్ రాకూడదా?కూల్ గా అడిగాడు

"ఏదో తేడాలా వుందే "అనుకున్నాడు డ్రైవర్ క్యాబ్ కోరి దగ్గర ఆగింది...ఆ యువకుడు క్యాబ్ దిగి డ్రైవర్ వైపు తిరిగి"లాస్ట్ స్మాల్ డౌట్ నువ్వు షాక్ అవ్వనంటే అడుగుతా? అన్నాడు "ఏంటి సర్? భయం భయంగా అడిగాడు డ్రైవర్ "టెన్ రూపీ కాయిన్స్ ఇవ్వొచ్చా..రిజర్వు బ్యాంకు చెల్లుతున్నాయని చెప్పింది.."అంటూ జేబులో చేయిపెట్టాడు.

"సర్ నన్నే డిపించకుండా డబ్బులివ్వండి..."ఏడ్పు గొంతుతో అన్నాడు క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడు పర్సులో నుంచి డబ్బు తీసిచ్చి "థాంక్యూ డ్రైవర్ సాబ్..ఐ లవ్ యు ...అన్నట్టు నీ పేరేమిటి భయ్యా..."అడిగాడు "జేమ్స్" అనిచెప్పి క్షణం ఆగకుండా డ్రైవర్ వెంటనే క్యాబ్ ను ముందుకు కదిలించాడు. సరిగ్గా క్యాబ్ కోఠి నుంచి రెండు మలుపులు తీసుకుని మూడవ మలుపు దగ్గరికి వచ్చేసరికి ఒక కారు క్యాబ్ కు అడ్డంగా వచ్చింది. అందులో నుంచి ముగ్గురువ్యక్తులు దిగి క్యాబ్ డ్రైవర్ ను బయటకు లాగారు.తమ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.

జేమ్స్ మెల్లిగా కళ్ళు తెరిచాడు.కొందరు ఆగంతకులు తనను లాక్కొచ్చి ఇక్కడికి తీసుకురావడం గుర్తుంది.పెనుగులాడితే ఎక్కడ ఏంచేస్తారనే భయంతో మిన్నకుండి పోయాడు.మెల్లిగా కళ్ళు తెరిచిన జేమ్స్ కు మెల్లిమెల్లిగా తననెక్కడికి తీసుకువచ్చారో అర్థమైంది. అదొక పాడుబడిన గోడౌస్...తుప్పుపట్టిన మిషనరీ వుంది., తన చేతులు ఫ్రీగానే వున్నాయి, కానీ తన నడుముచుట్టూ తాళ్లతో కట్టేసారు.అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కలేదు. అప్పుడే అక్కడికి నలుగురు ఆగంతకులు వచ్చారు.అందరూ లావుగా వున్నారు.ముఖాలకు మంకీ కాప్స్ వున్నాయి.

"భయ్యాస్ అసలు నన్ను ఇక్కడెందుకు తీసుకువచ్చారు? భయాన్ని నొక్కిపెట్టి అడిగాడు. తాను భయపడుతున్నట్టు కనిపిస్తే ఇంకా భయపెడుతారని భయం "నిన్నెందుకు తీసుకువచ్చామో నీకు నిజంగా తెలియదా? ఆ నలుగురిలో ఒకడడిగాడు "నాకేమైనా భవిష్యత్తు కలలో కనిపిస్తుందా?అయినా "నాకెలా తెలుస్తుంది? "ఓకే ఇందాక నువ్వు నీ క్యాబ్ లో తీసుకువచ్చావు కదా?అతనెవరు? ఆ నలుగురిలో మరొకడడిగాడు "ప్యాసింజర్..ప్రయాణీకుడు " చెప్పాడు జేమ్స్ "అతను నీకేం చెప్పాడు..అదే నీతో ఏమాట్లాడాడు? "గప్ చుప్ అదే పానీపూరి గురించి చెప్పాడు జేమ్స్ అంతే జేమ్స్ చెంప చెళ్లుమనిపించాడు ఇందాకటి వ్యక్తి.

(ఇంకా వుంది)


Rate this content
Log in

Similar telugu story from Crime