Varun Ravalakollu

Action Crime Thriller

4.8  

Varun Ravalakollu

Action Crime Thriller

డిటెక్టివ్-6

డిటెక్టివ్-6

3 mins
976


"నీతో జోకులేస్తానా జేమ్స్..ఎంతకాదన్నా నన్ను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చావు..."అన్నాడు సిద్దార్ధ "ముందు కూర్చోండి సర్ వేడివేడిగా కాఫీ తీసుకువస్తాను" అంటూ కిచెన్ వైపు కదలబోతుండగా అన్నాడు సిద్దార్థ "జేమ్స్ ఓసారి మీ ఫ్రెండ్ డేవిడ్ ను కలవాలి" "ఇప్పుడా? ఈ టైం లోనా? ఏమనాలో తోచక అన్నాడు...జేమ్స్ లో భయం మొదలైంది..కంగారు ఆందోళన మొదలయ్యాయి? ఒక ప్రశ్న వెనుక మరో ప్రశ్న...ఒక అనుమానం వెనుక మరో అనుమానం ...అసలు ఏం ఆగుతుంది?

డిటెక్టివ్ సిద్దార్దకు చనిపోయిన డేవిడ్ తో ఏం పని? ఇప్పుడు తనేం చేయాలి?జరిగినదంతా డిటెక్టివ్ సిద్దార్ధకు చెప్పాలి. ఆ నిర్ణయం అతని మనసులోకి రావడంతో మనసు తేలికపడింది. "సర్ ఒకసారి ఇలా రండి.."అంటూ బయటకు తీసుకువెళ్లాడు. ఇంటి ముందు నిలబడి వున్నారిద్దరూ.... "సర్ నాకు అంత అయోమయంగా వుంది .మిమ్మల్ని నా క్యాబ్ లో తీసుకువచ్చినప్పటి నుంచి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి."చెప్పాడు జేమ్స్. "అనూహ్యమైన సంఘటనలు అంటే?అడిగాడు జేమ్స్ వైపు చూస్తూ సిద్దార్థ "మీరు డేవిడ్ కోసం ఎందుకు వచ్చారో...?డేవిడ్ మీకెలా తెలుసో నాకు తెలియదు కానీ...డేవిడ్ చనిపోయాడు..యాక్సిడెంట్ లో:"చెప్పాడు

జేమ్స్.

"ఆ విషయం నాకు తెలుసు"తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ. "తెలుసా...మరి డేవిడ్ ను కలుద్దామన్నారు...అంతేకాదు డేవిడ్ నాకు కనిపించాడు.."ఎదురుగా వున్న డేవిడ్ ఇంటివైపు చూస్తూ చెప్పి మరోసారి ఉలిక్కిపడ్డాడు... "స...స...సర్ డే...వి...డ్ "ఎదురుగా డేవిడ్ నిలబడి తమ వైపే చూస్తున్నాడు. అటువైపు చూపించి చెప్పాడు జేమ్స్ సిద్ధార్థతో . సిద్దార్థ జేమ్స్ చూపించిన వైపు చూసి"బహుశా డేవిడ్ నీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు...పద..."అన్నాడు. జేమ్స్ ఈసారి భయపడలేదు.సిద్దార్థ తన వెంట వున్నాడన్న ధైర్యం కాబోలు. "సర్ ఇంతకు మనం డేవిడ్ ఇంటికి వెళ్లి ఏం చేస్తాం? "డేవిడ్ ను ఎందుకు చంపారో తెలుసుకుంటాము"తాపీగా చెప్పాడు.

"డేవిడ్ ను చంపారా? ఎందుకు?జేమ్స్ మోహంలో ఆశ్చర్యం ..భయం. "ఎందుకంటే...డేవిడ్ మిస్టర్ డి గురించి తెలుసుకున్నాడు...మిస్టర్ డి అంటే ..మిస్టర్ దయాళ్...మాఫియా కింగ్..చెప్పడం మొదలుపెట్టాడు సిద్దార్థ."డేవిడ్ క్యాబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం డేవిడ్ కు తెలియదు...ఓ రోజు క్యాబ్ డిక్కీలో మిస్టర్ డి మనుష్యులు డ్రగ్స్ పెడుతుండగా చూసాడు...నిలదీసాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెబుతానన్నారు..యాక్సిడెంట్ చేసి చంపేశారు.ప్రమాదంగా సృష్టించారు. అయితే డేవిడ్ తెలివైన వాడు..ఏదో ఆధారం దాచే ఉంటాడు..."అన్నాడు సిద్దార్థ "డేవిడ్ కు అంత ఆలోచన ఎలా వస్తుంది సర్.."డేవిడ్ ఇంటి దగ్గరికి వస్తుండగా అన్నాడు జేమ్స్..అప్పటికే జేమ్స్ కు భయం కొద్దిగా మొదలైంది. ఇంటి ముందు డేవిడ్ నిలబడి వున్న ఫీలింగ్ "వస్తుంది ఎందుకంటే..."అని ఆగి డేవిడ్ ఇంటి ముందు నిలబడి చెప్పాడు ..."డేవిడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ కాబట్టి షాకింగ్ గా అలాగే చూస్తుండిపోయాడు.క్రైమ్ సినిమా చూస్తున్నట్లుంది. "డేవిడ్ ఇంటికి తాళం వేస్తుంది కదా...పగలకొడదామా సర్"అన్నాడు జేమ్స్. రాయి కోసం చూస్తూ... అప్పుడే డేవిడ్ జేమ్స్ వైపు చూసాడు.జేమ్స్ కు ముచ్చెమట్లు పట్టాయి..తనకు నాలుగడుగుల దూరంలోనే వున్నాడు.డేవిడ్.. ఇంటిముందు వున్న పూలకుండీ దగ్గరికి వచ్చాడు. జేమ్స్ ట్రాన్స్ లో ఉన్నట్టు అక్కడికి వెళ్లి పూలకుండీ పక్కకు జరిపాడు.అక్కడ పూలకుండీ కింద తాళం చెవి వుంది.

అప్పటికే ఆ ఇంటి పరిసరాల్లోకి మిస్టర్ డి మనుష్యులు వచ్చారు.

ఏ క్షణమైనా అక్కడ ఆ గదిలో సునామీ వస్తుందా అన్నట్టు భయంతో వణికిపోతున్నారు మిస్టర్ డి అనుచరులు. అందరివైపూ చూసాడు మిస్టర్ డి..... "మనలోనే ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ వున్నాడు... ఇది నా అనుమానం కాదు .. కన్ఫర్మ్ .... ఇన్ఫార్మర్ ఎవరో బయటకు వస్తే సింపుల్ గా ఒకేఒక బులెట్ తో చంపేస్తాను.. లేదంటే.. ఆ ఇన్ఫార్మర్ ఎవరో నేను కనిపెడితే "అప్పుడు వాడిని మాములుగా చంపను...చిత్రవధ చేసి చంపుతాను " అందరివైపు చూసి అన్నాడు అక్కడున్నది ఏడుగురు.. అందరిలోనూ భయమే.. తమలో ఆ ఇన్ఫార్మర్ ఎవరు.. అందులో ఆరుగురు మాత్రమే మిస్టర్ డి మనుష్యులు.. మరి ఏడవవాడు ఎవడు ? "చెప్పండి... మర్యాదగా వాడెవడో బయటకురావాలి " మిస్టర్ డి హెచ్చరిస్తున్నట్టు అన్నాడు.. తనకు పక్క సమాచారం వచ్చింది. తన ఆక్టివిటీస్ బయిటకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ హైద్రాబాద్ రావడానికి ఆ ఇన్ఫార్మర్ కారణమైన వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. తనను మోసం చేసినవాడిని వదిలి పెట్టకూడదు..ఆ ఇన్ఫార్మర్ కు తను వేసే శిక్ష చూసి మిగితావాళ్ళు భయపడిపోవాలి. అదే సమయంలో .. డేవిడ్ ఇంటి ముందు జేమ్స్ పూలకుండీ కింద వున్న కీస్ తీసుకున్నాడు.జేమ్స్ వెన్నులో వణుకు.

కీస్ ఎక్కడున్నాయో డేవిడ్ చూపించాడు..కాదు కాదు డేవిడ్ ఆత్మ చూపించింది. ..ఇది ఇదెలా సాధ్యం? తను ఇంత టెన్షన్ పడుతుంటే డిటెక్టివ్ సిద్దార్థ మాత్రం కూల్ గా వున్నాడు. జేమ్స్ కీస్ సిద్దార్థకు ఇచ్చాడు.సిద్దార్థ కీస్ వంక చూసి లాక్ ఓపెన్ చేసాడు. ఇల్లు దుమ్ము కొట్టుకు పోయింది. ఒక్కారిగా జేమ్స్ లో భయం బాధ తన్నుకు వచ్చాయి. ఈ ఇంట్లోకి తాను ఎన్నో సార్లు వచ్చాడు. ఇక్కడే సోఫాలో కూచోని డేవిడ్ తో కబుర్లు చెప్పాడు. అదే డేవిడ్ ఇపుడు చనిపోయాక కనిపిస్తే బయపడి పోతున్నాడు. ఎంతప్రేమ వున్నా చనిపోయినవాళ్లు కనిపిస్తే ప్రేమ స్థానములో భయం చోటు చేసుకుంటుందా?

***

సుగాత్రి సిద్దార్థ ఫోన్ కోసం ఎదురుచూస్తుంది...పోలీసులు మఫ్టీలో మిస్టర్ డి ఇంటి ముందు వున్నారు.వాళ్లంతా ప్రత్యేక తర్ఫీదు పొందినవాళ్లు. మిస్టర్ డి ఆపరేషన్ ను ప్రారంభించింది సిద్ధార్థ. ఈ మిషన్ లో సిద్దార్థకు సహకరించాలని తనకు ముందే సమాచారం వుంది.మిస్టర్ డి హైద్రబాద్ లో స్టూడెంట్స్ ను యూత్ ను టార్గెట్ గా చేసుకుని వాళ్ళను డ్రగ్ ఎడిక్ట్ గా మారుస్తున్నాడన్న పక్కా సమాచారం వుంది. . హైద్రాబాద్ లో ఎంతో ఇష్టంగా తినే పానీపూరీలో డ్రగ్స్ ..?

ఐస్ క్రీం లో కూడా డ్రగ్స్ ను మిక్స్ చేసే తెలివితేటల క్రిమినల్స్ పెరిగిపోయారు. చాప క్రింద నీరులా ప్రవహించే డ్రగ్ దందాను ..మిస్టర్ డి మాఫియా సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించాలంటే సిద్దార్థ వల్లే సాధ్యం. అందుకే సిద్దార్థ చెప్పినట్టే చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఉంది. మిస్టర్ డి కు కుడిభుజం..కరుడుకట్టిన నేరస్థుడు ..కరీం కు సిద్దార్థ స్పాట్ పెట్టాడు.

***

మిస్టర్ డి తన చేతి వాచీ వంక చూసుకున్నాడు.సెకను ముల్లు తిరుగుతూనేవుంది...అతను ఇంత కోపంగా ఎప్పుడూ లేడు. తన దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్లలో సిద్దార్థ ఇన్ఫార్మర్ వున్నాడని రూఢీగా తెలిసింది. తనకు నమ్మకద్రోహం చేసినవాడిని వదిలిపెట్టకూడదు..అనుకున్నాడు. అదే సమయంలో కరీం కూడా అలానే అనుకున్నాడు..మిస్టర్ డి కి నమ్మకద్రోహం చేసిన వాళ్లలో ఈ ఆరుగురిలో ఎవరు...

(ఇంకా వుంది)


Rate this content
Log in

Similar telugu story from Action