Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

బ్రతకాలంటే భయం

బ్రతకాలంటే భయం

1 min
125


కామాన్ని మదిలో 

కనపడకుండా దాచేసి

కుటీలత్వపు నవ్వుల 

పలరింపులు చూస్తున్నాను


పశువాంచ కోర్కెలతో

తరుణి తనువుని

అణువణువు

తడిమే వేల దుర్భుద్ధి

పాపపు చూపులు...

కవులమని చెప్పుకుంటు

స్త్రీల అందాన్ని జగుప్సగా

వర్ణిస్తు భారతమాతలో

కూడ భామిని చూసే

నాసి రకపు కవితల గురించి

తెలుసుకుంటున్నాను


వావివరసలు మరిచి

అతివల దేహాన్ని తాకి 

శునకానందం పొందే

వెధవలను కనుగొన్నాను


నిలువెల్లా విషముతో

తేనె పూసిన మాటలతో

ఆడపిల్లలను

లోబరుచుకోవాలనుకునే

ఉరకుక్కల మాయను కనిపెట్టాను


మట్టిలో కలిసే తోలుతిత్తి

కోసం ఎందుకో ఈ నీచుల

ఆరాటం, స్త్రీ శరీరంలోని

మాంసపు ముద్దల కోసమా

ఈ కామాంధుల పోరాటం


పాపగ ఉన్నప్పుడు

ఈ మానవ మృగాల

ఆకలి తీర్చిన

అమ్మ ఎదను మరిచి

పరాయి స్త్రీల సౌందర్యం

కోసమే పరితపించిపోతూ


మహిళకు వ్యక్తిత్వం

ఉందని మరిచి

సోదరిగా కాకుండ

అంగడిలో బొమ్మలా

వర్ణన కోసం ప్రయాసపడుతూ

మనిషినని మరిచి

రాక్షసులుగా మారి

రాజ్యమేలుతున్నారు


మహిళగా ఒక్కరోజు బ్రతికి చూడు

అమ్మకే పుట్టిన ఓ మగరాజా..

ఆప్పుడైనా సామాన్యపు

అతివ విలువ నీకు

అర్ధమవుతుందేమో


ఈ నయవంఛనలు

అతి జుగుప్స కరమైన

కామ కేళి చూస్తూ

బ్రతకలంటే భయమవుతుంది

భారతావనిలో అడదానినై పుట్టినందుకు


      


Rate this content
Log in

Similar telugu poem from Classics