Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చీకటి లోకపు జాతర

చీకటి లోకపు జాతర

1 min
355


పాటల పందిరి మోజే..తీరని విరహపు జాతర..! 

పగటికి రేయికి నడుమన..ఆరని దీపపు జాతర..! 


వీధిని నమ్ముకు బ్రతికే..ఎర్రని కన్నుల నీడలు.. 

నీలిమ తోడుగ సాగే..చీకటి లోకపు జాతర..! 


ఉండవు మాటలు భాషలు..మూగగ తొలగే కొంగులు.. 

వేదన సాక్షిగ నలిగే..మల్లెల హాసపు జాతర..! 


బొట్టును చెరిపే చెమటకు..ఎంతటి సిగ్గో నిజముగ.. 

మధువును కోరే పెదవుల..వెలిగే మోహపు జాతర..! 


అమ్ముడు పోయే అమ్మల..కథలే అందం జగతికి.. 

పొంగే వ్యథలకు కుంగే..కుమిలే రాగపు జాతర..! 


సబలకు అబలని ముద్రను..వేసిన ముచ్చట వింతయె.. 

చిరిగీ చిరగని పతంగి..ఎదలో గాయపు జాతర..! 


మనసు దేవత పదములు..కొలిచే పవిత్ర నదులే..

మగువల రూపున కదిలే..చెదరని మౌనపు జాతర..!


Rate this content
Log in

Similar telugu poem from Romance