చిట్టి గుండె
చిట్టి గుండె
చిట్టిగుండెకెన్ని గాయాలు చేసిందో కదా ప్రేమ..!
అరె ఈ మనస్సు నెంతగా కోసిందో కదా ప్రేమ..!
నమ్ముకున్నందుకేగా.. మరి బలైపోవటాలు..
తీపిమాటల కత్తులెన్ని దూసిందో కదా ప్రేమ..!
తనతలపుల దుమారం..మధువనుకున్నావా..
లేతమాయ నవ్వులెన్ని ఒలకబోసిందో కదా ప్రేమ..!
హృదయం వికసించకుండా సున్నితత్వమెలాగ..
చూపులతేనె వానలెలా కురిసిందో కదా ప్రేమ..!
రెండున్నందుకేగా విబేధాలు దు:ఖసాగరాలు..
మూడోదైపోయి ఎంతలా మసకేసిందో కదా ప్రేమ..!
అశ్రువుతో కనుపాపలకు కళ్యాణమేగా మనసా..
యుగాలసాక్షిగా భలే తాళం వేసిందో కదా ప్రేమ..!