Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ఈవని రవిశంకర శర్మ

Abstract

4.5  

ఈవని రవిశంకర శర్మ

Abstract

గాలి ..!

గాలి ..!

1 min
589


గాలి ..!

వినగానే చక్కలిగిలి .

అనేక వాయువుల సమ్మేళనం ;

జగతికి ఎంతో అవసరం .

భూమిచుట్టూ ఉంది ;

హాని కలిగించనిది .

నీడలో ఉండేదయితే చల్లనిగాలి ,

బయట తట్టుకోలేని హోరుగాలి .

పచ్చని పొలాల్లో అది పైరుగాలి ,

చలికాలంలో వణికిస్తే చల్లగాలి .

వర్షంతో పెనవేసుకుంటే గాలివాన ,

తనే రుద్రతాండవం చేస్తే సుడిగాలి .

వేసవిలో చెమటలు పట్టించేది వడగాలి ,

జలాశయాల దగ్గర వీచేది పిల్లగాలి .

కూర్చుంటే గాలి , నుంచుంటే గాలి ;

నడిచినా , పరుగెట్టినా వీడని గాలి .

మనిషికే కాదు , ప్రతిజీవికి అనుక్షణం కావాలి ;

అత్యవసర పరిస్థితుల్లో తక్షణం ఇవ్వాలి .

వాహనచక్రాలకి గాలి , పక్షిలా ఎగరడానికి గాలి ;

ఓడ తెరచాపకు వాలుగానూ ఉందది .

శబ్దం వినాలంటే గాలి ,

ఆకాశం నీలంగా కనిపించడానికీ గాలి .

బట్టలు ఆరాలన్నా గాలి ,

జుట్టు అందంగా రేగినా గాలి .

పూల పరిమళం మనకు చేరడం ,

ధూపం పరిసరాల్లో వ్యాపించడం ;

గాలి వలననే సంభవం .

మనకే సొంతమైన ఈ గాలి ,

పిలవగానే పోస్తుంది ప్రాణం ;

ఇక సెలవంటే , చేసేస్తుంది దహనం !

************************



Rate this content
Log in

Similar telugu poem from Abstract